నిషేధించబడిన కొన్ని అమ్మకాలు, లావాదేవీలు ఏమిటి?
- الباب / الفصل
- قسم المنوعات
السؤال
س5: ما بعض أنواع المعاملات والبيوع المحرمة؟
ప్రశ్న 5: నిషేధించబడిన కొన్ని అమ్మకాలు, లావాదేవీలు ఏమిటి?
الجواب
ج:١. الغش، ومنه: إخفاء عيب السلعة.
- فعن أبي هريرة رَضِيَ اللَّهُ عَنْهُ، أنَّ رسول الله ﷺ مرَّ على صبرة- أي: كومة- طعام، فأدخل يده فيها، فنالت أصابعه بللًا. فقال: «ما هذا يا صاحب الطَّعام؟» قال: أصابته السَّماء يا رسول الله. قال:
«أفلا جعلته فوق الطَّعام كي يراه النَّاس؟ من غشَّ فليس منِّي»
رواه مسلم.
- الربا: ومنه أن آخذ ألفًا من إنسان دينًا على أن أردها إليه ألفين.
- والزيادة هي الربا المحرم.
قال تَعَالَى:
﴿وَأَحَلَّ ٱللَّهُ ٱلۡبَيۡعَ وَحَرَّمَ ٱلرِّبَوٰاْۚ﴾
[البقرة: ٢٧٥].
- الغرر والجهالة: كأن أبيعك الحليب في ضرع الشاة، أو السمكة في الماء ولم أصطدها بعد.
- ففي الحديث:
«نهى رسول الله صلى الله عليه وسلم عن بيع الغرر»
జవాబు : 1 - మోసం: వస్తువులో లోపాన్ని దాచడం వంటివి.
- అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి (బజారులోని) ధాన్యపు కుప్ప వద్దకు వచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన చేతిని అందులో జొప్పించి చూడగా, ఆయన చేతివేళ్లకు కొంత తేమ తగిలింది. అది చూసి ఆయన (అతనితో ఇలా అడిగారు: "ఓ ధాన్యపు కుప్ప యజమానీ, ఏమిటిది?" దానికి ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు: "ఓ రసూలుల్లాహ్, వర్షం పడింది (ధాన్యం వర్షంలో తడిసింది)". అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు:
"ప్రజలు చూసేలా నీవు ధాన్యం గుట్టపై భాగాన ఈ తడిసిన ధాన్యాన్ని ఎందుకు ఉంచలేదు? మోసం చేసేవాడికీ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు."
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
2 -రిబా (వడ్డీ): ఒకరి నుండి వెయ్యి అప్పుగా తీసుకుని, రెండు వేలు తిరిగి ఇవ్వడం.
ఈ అదనపు ధనం నిషేధిత వడ్డీగా పరిగణించబడుతుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{మరియు వ్యాపారాన్ని (కొనుగోళ్ళు, అమ్మకాలను) ధర్మబద్ధం చేశాడు మరియు వడ్డీలను నిషేధించాడు.}
[అల్ బఖర: 50]
- ఘరర్ (అనిశ్చితి, అపాయము) మరియు జహాలహ్ (అజ్ఞానం): ఆడ గొర్రె పొదుగులో ఉన్న పాలను అమ్మడం లేదా ఇంకా పట్టుకోని నీటిలో చేపలను అమ్మడం వంటివి అంటే తన ఆధీనంలో లేని దానిని అమ్మడం అన్నమాట.
- హదీసులో ఇలా ఉంది:
«ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ గారు అస్పష్టమైన (పూర్తిగా తెలియని లేదా అనిశ్చితి ఉన్న) వ్యాపార లావాదేవీలను నిషేధించారు.»