Skip to content

అహ్లె సున్నతు వల్ జమాఅతు అంటే ఎవరు ?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س42: من هم أهل السنة والجماعة؟

42: అహ్లె సున్నతు వల్ జమాఅతు అంటే ఎవరు ?

الجواب

ج:هم من كان على مثل ما كان عليه النبي صلى الله عليه وسلم وأصحابه في القول والعمل والاعتقاد.

  • وسموا أهل السنة: لاتباعهم سنة النبي صلى الله عليه وسلم، وترك الابتداع.
  • والجماعة: لأنهم اجتمعوا على الحق ولم يتفرقوا فيه.
  • قال عليه الصلاة والسلام:

«إن بني إسرائيل تفرقت على ثنتين وسبعين ملة، وتفترق أمتي على ثلاث وسبعين ملة، كلهم في النار، إلا ملة واحدة». قالوا: ومن هي يا رسول الله ؟ قال: «ما أنا عليه وأصحابي»

رواه الترمذي.

జవాబు: తమ విశ్వాసంలోనూ, మాటలలోనూ మరియు చేతలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను, ఆయన సహాబాలను మాత్రమే తు.చ. తప్పకుండా అనుసరించేవారు.

మరియు వారికి అహ్లుల్ సున్నహ్ అనే పేరు పెట్టారు: ఎందుకంటే వారు కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులను మాత్రమే అనుసరించినందుకు మరియు ధర్మంలో నూతన కల్పితాలను త్యజించినందుకు గానూ.

మరియు జమాఅతు: ఎందుకంటే వారు సామూహికంగా సత్యంపై జమ అయ్యారు మరియు తమలో తాము భేదభావాలతో విడిపోలేదు.

ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు:

నిశ్ఛయంగా బనీ ఇస్రాయీల్ 72 వర్గాలుగా విభజించబడ్డారు, మరియు నా ఉమ్మత్ 73 వర్గాలుగా విభజించబడుతుంది. వారందరూ నరకంలోకి పోతారు, ఒక్క వర్గం మినహాయించి. వారు అడిగారు: "ఏది అది, యా రసూలల్లాహ్?" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: "నేను మరియు నా సహాబాలు ఉన్న మార్గంను అనుసరించినవారు."

దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.