33వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ దివ్యనామము గురించి వివరించండి?
- الموضوعات
- الإيمانالإيمان بالله تعالى
- التصنيف الشرعي
- العقيدةالإيمان بالله عز وجلتوحيد الأسماء والصفات
- الباب / الفصل
- قسم العقيدة
السؤال
س33: اشرح هذه الأسماء.
33వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ దివ్యనామము గురించి వివరించండి?
الجواب
ج:الله: ومعناه الإله المعبود بحق، وحده لا شريك له.
- الرب: أي الخالق والمالك الرازق والمدبر وحده سُبْحَانَهُ.
- السميع: الذي وسع سمعه كل شيء، ويسمع كل الأصوات على اختلافها وتنوعها.
- البصير: الذي يرى كل شيء، ويبصر كل شيء صغر أو كبر.
- العليم: فهو الذي أحاط علمه بكل شيء بالماضي والحاضر والمستقبل.
- الرحمن: الذي وسعت رحمته كل مخلوق وحي، فكل العباد والمخلوقات تحت رحمته.
- الرزاق: الذي عليه رزق جميع المخلوقات من الإنس والجن وجميع الدواب.
- الحي: الحي الذي لا يموت، وكل الخلق يموتون.
- العظيم: الذي له الكمال كله والعظمة كلها في أسمائه وصفاته وأفعاله.
- الحكيم: الذي أحكم خلقه، وأتقنه، وأحسنه، وله الحكمة في خلقه وأمره.
- والحكمة: وضع الأشياء مواضعها، وتنزيلها منازلها.
జవాబు: అల్లాహ్: అర్ధము అల్ ఇలాహ్, నిజమైన ఆరాధ్యుడు, ఏకైకుడు, అద్వితీయుడు, ఆయనకు సాటి గానీ, భాగస్వాములు గానీ ముమ్మాటికీ ఎవ్వరూ లేరు, ఏదీ లేదు.
అర్రబ్: సృష్టికర్త, యజమాని, పోషకుడు, వ్యవహారాలను చక్కబెట్టేవాడు, ఏకైకుడు, ఏ లోపమూ మరియు ఏ కొరతా లేని వాడు.
అస్సమీఉ: సృష్టిలోని ప్రతిదీ వినగలిగేటంతటి గొప్ప శ్రవణశక్తి గలవాడు. వాటి మధ్య తేడాలు మరియు వైరుధ్యాలు ఉన్నప్పటికీ సృష్టిలోని శబ్దాలన్నింటినీ వినగలవాడు,
అల్ బసీరు: సృష్టిలోని ప్రతిదీ చూడగలిగేవాడు. సూక్ష్మమైనదైనా, అతి పెద్దది అయినా ప్రతిదీ చూడగలిగేవాడు.
అల్ అ'లీము: భూత, వర్తమాన, భవిష్య కాలములలో సృష్టిలోని ప్రతిదానిని తన అపూర్వ జ్ఞానంతో ఆవరించి ఉన్నవాడు.
అర్రహ్మాన్: సకల సృష్టిరాశులను ఆవరించగలిగేంత కరుణ కలిగినవాడు. ప్రతి దాసుడూ, ప్రతి సృష్టిరాశీ ఆయన కారుణ్యం వలననే జీవిస్తున్నాయి.
అర్రజ్'జాఖ్: మొత్తం మానవజాతినీ, జిన్నాతులనూ మరియు సృష్టిరాశులన్నింటినీ పోషించగలిగే శక్తి గలవాడు.
అల్ హయ్యు: నిత్యుడు, మరణం లేనివాడు. మొత్తం సృష్టి నాశనమై పోయినా మిగిలి ఉండే వాడు.
అల్ అజీమ్: తన దివ్యనామాలు, గుణగుణాలు మరియు దివ్య కార్యాలలో పరిపూర్ణతలన్నీ మరియు మహిమలన్నీ కలిగి ఉన్నవాడు.
హకీమ్: అతను తన సృష్టిని పరిపూర్ణంగా, అద్భుతంగా మరియు మంచిగా సృష్టించినవాడు, అతనికి తన సృష్టిలో మరియు తీర్పులలో హిక్మత్ (జ్ఞానం) ఉంది.
హిక్మత్: ప్రపంచంలోని వస్తువులను తమ స్థానాల్లో ఉంచడం, వాటిని వారి సరైన స్థాయిలో ఉంచడం.