Skip to content
సూరాల జాబితా /

الزَّلزَلة

الزَّلزَلة is chapter 99 of the Quran and has 8 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

8 ఆయతులు సూరా సంఖ్య 99
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا

భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు!

Explanation & meanings · 1
  1. ఇది మొదటి సారి బాకా ఊదబడినప్పుడు సంభవిస్తుంది.

وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا

మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు!

Explanation & meanings · 1
  1. ఇది రెండవసారి బాకా ఊదబడినప్పుడు జరుగుతుంది. ఆ రోజు భూమి తనలో పాతబడిన వారినంతా బయట వేస్తుంది. వారంతా సజీవులై లేచి బయటికి వస్తారు.

وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا

మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు.

يَوۡمَئِذٖ تُحَدِّثُ أَخۡبَارَهَا

ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది.

Explanation & meanings · 1
  1. దాని సమాచారాలు ఇలా ఉంటాయి, దైవప్రవక్త ('స'అస) అన్నారు: "ప్రతివ్యక్తి భూమిపై చేసిన కర్మలన్నింటికీ, అది సాక్ష్యమిస్తుంది: 'ఈ ఈ వ్యక్తి ఈ ఈ కర్మలు, ఈ ఈ రోజులలో చేసాడని, తెలుపుతుంది.' " (తిర్మి'జీ, ముస్నద్ అ'హ్మద్-2/374).

بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا

ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు.