Skip to content
సూరాల జాబితా /

البَينَة

البَينَة is chapter 98 of the Quran and has 8 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

8 ఆయతులు సూరా సంఖ్య 98
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

لَمۡ يَكُنِ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ وَٱلۡمُشۡرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأۡتِيَهُمُ ٱلۡبَيِّنَةُ

ఎంతవరకైతే స్పష్టమైన నిదర్శనం రాదో! అంత వరకు సత్యతిరస్కారులైన పూర్వగ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు (తమ సత్యతిరస్కారాన్ని) మానుకునేవారు కారు!

Explanation & meanings · 1
  1. అంటే అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి ఒక సందేశహరుడు వచ్చి సరయిన, సమంజసమైన విషయాలు వ్రాయబడిన పరిశుద్ధ పుటలు చదివి విన్పించనంత వరకు వారు మానుకోరు.

رَسُولٞ مِّنَ ٱللَّهِ يَتۡلُواْ صُحُفٗا مُّطَهَّرَةٗ

అల్లాహ్ తరఫు నుండి వచ్చిన సందేశహరుడు, వారికి పవిత్ర గ్రంథ పుటలను వినిపిస్తున్నాడు.

Explanation & meanings · 2
  1. చూము'హమ్మద్ ('స'అస).
  2. ఖుర్ఆన్.

فِيهَا كُتُبٞ قَيِّمَةٞ

అందులో సమంజసమైన వ్రాతలు (సత్యోపదేశాలు) ఉన్నాయి.

Explanation & meanings · 1
  1. ధర్మశాసనాలు.

وَمَا تَفَرَّقَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ إِلَّا مِنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَةُ

మరియు స్పష్టమైన సూచన వచ్చిన తర్వాతనే గ్రంథ ప్రజలు భేదాభిప్రాయలలో పడ్డారు.

Explanation & meanings · 1
  1. దైవప్రవక్త ('స'అస) రానున్నాడని వారి గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ఆ ప్రవక్త ('స'అస) అరబ్బులలో వచ్చాడని గ్రంథప్రజలు అసూయ పడి అతనిని తిరస్కరించారు. చూడండి, 3:19.

وَمَآ أُمِرُوٓاْ إِلَّا لِيَعۡبُدُواْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ حُنَفَآءَ وَيُقِيمُواْ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُواْ ٱلزَّكَوٰةَۚ وَذَٰلِكَ دِينُ ٱلۡقَيِّمَةِ

మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము."

Explanation & meanings · 1
  1. 'హనీఫన్: వాలు, వంగు, మొగ్గు, ఒక వైపునకు మొగ్గటం ఏకాగ్రచిత్తం, ఏకదైవ సిద్ధాంతం. అంటే షిర్క్ నుండి తౌ'హీద్ కు, బహుదైవారాధన నుండి ఏకదైవారాధన వైపునకు మరలటం. ఉదా: ఇబ్రాహీమ్ ('అ.స.) చేసినట్లు ఏకదైవారాధన మరియు సత్యధర్మాన్ని అనుసరించటం.