Skip to content
సూరాల జాబితా /

المَعَارج

المَعَارج is chapter 70 of the Quran and has 44 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

44 ఆయతులు సూరా సంఖ్య 70
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

سَأَلَ سَآئِلُۢ بِعَذَابٖ وَاقِعٖ

ప్రశ్నించేవాడు, ఆ అనివార్యమైన శిక్షను గురించి ప్రశ్నించాడు;

Explanation & meanings · 1
  1. ఈ ప్రశ్నించే సత్యతిరస్కారి న'దర్ బిన్-'హారిస్' లేదా అబూ-జహల్ కావచ్చని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. చూడండి, 8:32. అతడు బద్ర్ యుద్ధంలో చంపబడ్డాడు.

لِّلۡكَٰفِرِينَ لَيۡسَ لَهُۥ دَافِعٞ

సత్యతిరస్కారులకు విధించబడే దాని గురించి; దానిని ఎవ్వడూ తొలగించలేడు.

مِّنَ ٱللَّهِ ذِي ٱلۡمَعَارِجِ

అది ఆరోహణ మార్గాలకు యజమానుడైన అల్లాహ్ తరఫు నుండి వస్తుంది.

Explanation & meanings · 1
  1. చూడండి, 76:3.

تَعۡرُجُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيۡهِ فِي يَوۡمٖ كَانَ مِقۡدَارُهُۥ خَمۡسِينَ أَلۡفَ سَنَةٖ

యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో, దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్) ఆయన వద్దకు అధిరోహిస్తారు.

Explanation & meanings · 2
  1. చూడండి, 22:47 అక్కడ నీ ప్రభువు దృష్టిలో ఒక దినము మీరు లెక్కించే వేయి సంవత్సరాలకు సమానం. ఇంకా చూడండి, 32:5. అల్లాహ్ (సు.తా.) అనంతుడు, అపారుడు, అంతులేనివాడు, కాలపరిమితికి అతీతుడు. పరలోక జీవితంలో మానవునికి కూడా కాలమనే దానికి ఎలాంటి అర్థం ఉండదు.
  2. రూ'హ్: దీనిని ఇక్కడ కొందరు వ్యాఖ్యాతలు జిబ్రీల్ ('అ.స.) అన్నారు. మరికొందరు మానవుల ఆత్మలన్నారు. చూడండి, 19:17 వ్యాఖ్యానం 1.

فَٱصۡبِرۡ صَبۡرٗا جَمِيلًا

కావున (ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు, ఉత్తమమైన సహనంతో!