Skip to content
సూరాల జాబితా /

الحَاقة

الحَاقة is chapter 69 of the Quran and has 52 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

52 ఆయతులు సూరా సంఖ్య 69
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

ٱلۡحَآقَّةُ

ఆ అనివార్య సంఘటన (పునరుత్థానం)!

مَا ٱلۡحَآقَّةُ

ఏమిటా అనివార్య సంఘటన?

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحَآقَّةُ

మరియు ఆ అనివార్య సంఘటన, అంటే ఏమిటో నీకేమి తెలుసు?

كَذَّبَتۡ ثَمُودُ وَعَادُۢ بِٱلۡقَارِعَةِ

సమూద్ మరియు ఆద్ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు.

Explanation & meanings · 1
  1. 'ఆద్ మరియు స'మూద్ జాతుల సమాచారం కొరకు చూడండి, 7:65-79.

فَأَمَّا ثَمُودُ فَأُهۡلِكُواْ بِٱلطَّاغِيَةِ

కావున సమూద్ జాతి వారైతే ఒక భయంకరమైన గర్జన ద్వారా నాశనం చేయబడ్డారు.