Skip to content

రమదాను మాసంలో స్త్రీలు ఇంట్లో సలాహ్ (నమాజు) ఆచరించడం ఉత్తమమా? లేక మస్జిదు వెళ్ళి ఆచరించడం ఉత్తమమా? మరీ ముఖ్యంగా మస్జిదులో ప్రసంగాలు, హితబోధనలు కొనసాగుతున్నప్పుడు అయితే మస్జిదులో సలాహ్ చేసేందుకు వెళుతున్న స్త్రీలకు మీరేమని హితబోధ చేస్తారు?

السؤال

1వ ప్రశ్న:

రమదాను మాసంలో స్త్రీలు ఇంట్లో సలాహ్ (నమాజు) ఆచరించడం ఉత్తమమా? లేక మస్జిదు వెళ్ళి ఆచరించడం ఉత్తమమా? మరీ ముఖ్యంగా మస్జిదులో ప్రసంగాలు, హితబోధనలు కొనసాగుతున్నప్పుడు అయితే మస్జిదులో సలాహ్ చేసేందుకు వెళుతున్న స్త్రీలకు మీరేమని హితబోధ చేస్తారు?

س26: أيّهما أفضل للمرأة: أن تصلّي في ليالي رمضان في بيتها، أو في المسجد، وخصوصًا إذا كان فيه مواعظ وتذكيرٌ؟ وما توجيهك للنّساء اللاتي يصلّين في المساجد؟

الجواب

జవాబు:

స్త్రీలు తమ ఇంట్లో సలాహ్ చేయడం ఉత్తమం ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక హదీథులో ఇలా ఉన్నది:

"మరియు స్త్రీల విషయంలో వారి ఇల్లు సలాహ్ కొరకు ఎంతో ఉత్తమమైనది".

ఎందుకంటే స్త్రీలు తమ ఇంటి నుండి బయటికి వెళ్ళడం చాలా సందర్భాలలో చెడుకు దారి తీయవచ్చు అందుచేత ఆమె తన ఇంట్లోనే సలాహ్ చేయడమనేది, మస్జిదుకు వెళ్లడం కంటే ఎంతో ఉత్తమమైనది. ఇక ప్రసంగాలు, హితబోధల విషయానికొస్తే వాటిని క్యాసెట్ల ద్వారా, ఆన్ లైన్ లో కూడా వినవచ్చు.

ఇక సలాహ్ కోసం మస్జిదుకు వెళ్ళే స్త్రీల విషయంలో వారికి నేను చేసే హితబోధ ఏమిటంటే వారు ఎటువంటి అలంకరణలు లేకుండా సువాసనలు పూసుకోకుండా వెళ్ళాలి.

ﺟ26: الأفضل أن تصلّي في بيتها؛ لعموم قول النبيّ ﷺ:

«وَبُيُوتُهُنَّ خَيْرٌ لَهُنَّ» [1]،

ولأن خروج النّساء لا يسلم من فتنةٍ في كثيرٍ من الأحيان، فكون المرأة تبقى في بيتها خيرٌ لها من أن تخرج للصلاة في المسجد، والمواعظ والحديث يمكن أن تحصل عليها بواسطة الشريط.

[9] رواه أبو داود، كتاب الصلاة، باب ما جاء في خروج النساء إلى المساجد (567).

وتوجيهي للاتي يصلّين في المسجد: أن يخرجن من بيوتهن غير متبرّجاتٍ بزينةٍ، ولا متطيّباتٍ.