Skip to content

ఒక మహిళకు మధ్యాహ్నం తర్వాత అంటే ఒంటి గంట తరువాత ఋతుస్రావం మొదలైంది. ఒకవేళ ఆమె అప్పటి వరకు జొహ్ర్ సలాహ్ (నమాజు) చేయనట్లయితే, శుద్ది పొందిన తరువాత ఆమె ఆ జొహ్ర్ సలాహ్ ను ఖజా చేయవలసింది ఉంటుందా?

السؤال

1వ ప్రశ్న:

ఒక మహిళకు మధ్యాహ్నం తర్వాత అంటే ఒంటి గంట తరువాత ఋతుస్రావం మొదలైంది. ఒకవేళ ఆమె అప్పటి వరకు జొహ్ర్ సలాహ్ (నమాజు) చేయనట్లయితే, శుద్ది పొందిన తరువాత ఆమె ఆ జొహ్ర్ సలాహ్ ను ఖజా చేయవలసింది ఉంటుందా?

س21: إذا حاضت المرأة الساعة الواحدة ظهرًا مثلًا، وهي لم تصلّ بعد صلاة الظّهر، فهل يلزمها قضاء تلك الصلاة بعد الطّهر؟

الجواب

జవాబు:

ఈ విషయంలో ఉలమాల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం పైన ప్రస్తావించబడిన ఆ జొహ్ర్ సలాహ్ తప్పనిసరిగా ఖజా చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆమె ఎటువంటి తప్పు చేయలేదు. ఎందుకంటే సలాహ్ ను దాని అంతిమఘడియ వరకు వాయిదా వేయడం అనుమతించబడినది.

కానీ మరికొంత మంది ఉలమాల అభిప్రాయం ప్రకారం ఆమెపై ఆ సలాహ్ ఖజా పూర్తి చేయడం తప్పనిసరి. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన హదీథులో ఇలా ఉంది:

‘ఎవరైతే సలాహ్ యొక్క ఒక్క రకాతు (దాని సమయం లోపల) పొందినా అతను పూర్తి సలాహ్ ను పొందినట్లే’.

అయితే జాగ్రత్త నిమిత్తం ఆ సలాహ్ యొక్క ఖజా ను ఆమె పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే ఖజా చేయవలసినది ఒక్కటే సలాహ్ కాబట్టి దానిని పూర్తి చేయడంలో ఒక స్త్రీ పై ఎలాంటి భారమూ ఉండదు.

ﺟ21: في هذا خلافٌ بين العلماء، فمنهم من قال: إنه لا يلزمها أن تقضي هذه الصلاة؛ لأنها لم تفرط، ولم تأثم؛ حيث إنه يجوز لها أن تؤخّر الصلاة إلى آخر وقتها.

ومنهم من قال: إنه يلزمها القضاء، أي: قضاء تلك الصلاة؛ لعموم قوله ﷺ:

«مَنْ أَدْرَكَ رَكْعَةً مِنَ الصَّلَاةِ فَقَدْ أَدْرَكَ الصَّلَاةَ» [1].

[5] تقدم تخريجه.

والاحتياط لها: أن تقضيها؛ لأنها صلاةٌ واحدةٌ، لا مشقة في قضائها.