18వ ప్రశ్న: బిద్అతు (ఇస్లాం ధర్మంలో నూతన కల్పితాలు, ఆవిష్కరణలు) అంటే ఏమిటి? మనం వాటిని అంగీకరిస్తామా ?
- الموضوعات
- التوحيد وحمايتهالبدعة
- التصنيف الشرعي
- العقيدةالبدعةحقيقة البدعة
- الباب / الفصل
- قسم العقيدة
السؤال
س18: ما هي البدعة؟ وهل نقبلها؟
18వ ప్రశ్న: బిద్అతు (ఇస్లాం ధర్మంలో నూతన కల్పితాలు, ఆవిష్కరణలు) అంటే ఏమిటి? మనం వాటిని అంగీకరిస్తామా ?
الجواب
ج:كل ما أحدثه الناس في الدين، ولم يكن على عهد النبي صلى الله عليه وسلم وأصحابه.
- لا نقبلها، ويجب أن نردها.
لقول النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:
«كل بدعة ضلالة»
رواه أبو داود.
- وقوله عليه الصلاة والسلام:
«من عمل عملًا ليس عليه أمرنا فهو رد»
رواه مسلم.
مثالها: الزيادة في العبادة، كالزيادة على الوضوء غسلة رابعة، وكالاحتفال بالمولد النبوي، فلم يرد عن النبي صلى الله عليه وسلم وأصحابه.
జవాబు: ప్రజలు ధర్మంలో ఆవిష్కరించిన ప్రతి నూతన కల్పితమూ బిద్అత్ గానే పరిగణించబడుతుంది. మరియు దాని ఉనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల కాలంలో కనబడదు.
దానిని మనం అంగీకరించకూడదు, వాస్తవానికి దానిని సూటీగా తిరస్కరించ వలెను.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
ప్రతి నూతన ధార్మిక కల్పితం, ఆవిష్కరణ మార్గభ్రష్టత్వమే.
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
- మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సూక్తి:
ఎవరైనా నా ఆదేశం లేని ఏదైన ఆచరణ (ధర్మం అనుకుని) చేస్తే అది తిరస్కరించబడును.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దానికి ఉదాహరణకు: వుజులో (మూడు సార్లు కడగటంతో ఆగకుండా) నాల్గవ సారి కడగటం, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పుట్టినరోజు జరుపుకోవడం వంటి ఆరాధనలో నిర్దేశించబడిన వాటిలో హద్దులు మీరటం. ఇలాంటివి ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నుండి గానీ, ఆయన సహాబాల రజియల్లాహు అన్హుమ్ నుండి గానీ నమోదు చేయబడలేదు.