Skip to content
సూరాల జాబితా /

الأحقَاف

الأحقَاف is chapter 46 of the Quran and has 35 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

35 ఆయతులు సూరా సంఖ్య 46
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

حمٓ

హా - మీమ్.

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

تَنزِيلُ ٱلۡكِتَٰبِ مِنَ ٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَكِيمِ

ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది.

مَا خَلَقۡنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَآ إِلَّا بِٱلۡحَقِّ وَأَجَلٖ مُّسَمّٗىۚ وَٱلَّذِينَ كَفَرُواْ عَمَّآ أُنذِرُواْ مُعۡرِضُونَ

మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాము. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవు తున్నారు.

Explanation & meanings · 1
  1. చూడండి, 14:48.

قُلۡ أَرَءَيۡتُم مَّا تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ أَرُونِي مَاذَا خَلَقُواْ مِنَ ٱلۡأَرۡضِ أَمۡ لَهُمۡ شِرۡكٞ فِي ٱلسَّمَٰوَٰتِۖ ٱئۡتُونِي بِكِتَٰبٖ مِّن قَبۡلِ هَٰذَآ أَوۡ أَثَٰرَةٖ مِّنۡ عِلۡمٍ إِن كُنتُمۡ صَٰدِقِينَ

వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ప్రార్థిస్తున్న వాటిని గురించి ఆలోచించారా? అయితే నాకు చూపండి. వారు భూమిలో ఏమి సృష్టించారో? లేదా, వారికి ఆకాశాలలో ఏదైనా భాగముందా? మీరు సత్యవంతులే అయితే, దీనికి (ఈ ఖుర్ఆన్ కు) ముందు వచ్చిన ఏదైనా గ్రంథాన్ని లేదా ఏదైనా మిగిలి ఉన్న జ్ఞానాన్ని తెచ్చి చూపండి."

Explanation & meanings · 2
  1. రఅ"య్ తుమ్: అంటే చెప్పండి, చూపండి, లేక ఆలోచించారా.
  2. అసా'రతిమ్ మిన్ 'ఇల్మిన్: అంటే తెలివితేటలు, బఖియ్యతిమ్-మిన్-'ఇల్మిన్: అంటే పూర్వప్రవక్తల మీద అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం వహీ నుండి మిగిలి ఉన్న నిజ దివ్యజ్ఞానం.

وَمَنۡ أَضَلُّ مِمَّن يَدۡعُواْ مِن دُونِ ٱللَّهِ مَن لَّا يَسۡتَجِيبُ لَهُۥٓ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ وَهُمۡ عَن دُعَآئِهِمۡ غَٰفِلُونَ

మరియు అల్లాహ్ ను వదలి పునరుత్థాన దినం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారి కంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు (తమను ప్రార్థించే) వారి ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు.