46 : 9
قُلۡ مَا كُنتُ بِدۡعٗا مِّنَ ٱلرُّسُلِ وَمَآ أَدۡرِي مَا يُفۡعَلُ بِي وَلَا بِكُمۡۖ إِنۡ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَيَّ وَمَآ أَنَا۠ إِلَّا نَذِيرٞ مُّبِينٞ
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నేను మొట్టమొదటి ప్రవక్తనేమీ కాను. నాకూ మరియు మీకూ ఏమి కానున్నదో నాకు తెలియదు. నేను అనుసరించేది, నాపై అవతరింపజేయ బడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే. మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే."
Explanation & meanings · 1
- "అల్లాహ్ (సు.తా.) సాక్షిగా నేను ('స'అస) దైవప్రవక్తను అయినప్పటికీ, మీకూ మరియు నాకూ పునరుత్థానదినమున ఏమి సంభవించనున్నదో నాకు తెలియదు." ('స'బుఖారీ).