46 : 11
وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلَّذِينَ ءَامَنُواْ لَوۡ كَانَ خَيۡرٗا مَّا سَبَقُونَآ إِلَيۡهِۚ وَإِذۡ لَمۡ يَهۡتَدُواْ بِهِۦ فَسَيَقُولُونَ هَٰذَآ إِفۡكٞ قَدِيمٞ
సత్యతిరస్కారులు, విశ్వాసులను గురించి ఇలా అంటారు: "ఒకవేళ ఇందులో (ఇస్లాంలో) మేలే ఉంటే?, వీరు మా కంటే ముందుగా దాని వైపునకు పోయి ఉండేవారు కాదు!" మరియు వారు దాని (ఖుర్ఆన్) నుండి మార్గదర్శకత్వం పొందలేదు! కాబట్టి వారు: "ఇదొక ప్రాచీన బూటక కల్పనయే!" అని అంటారు.
Explanation & meanings · 1
- అంటే మొట్టమొదట ఇస్లాం స్వీకరించిన వారిలోని పేదవారూ మరియు బలహీనవర్గాలకు చెందిన వారూ అయిన బిలాల్, 'అమ్మార్, 'సుహైబ్ మరియు 'ఖబ్బాబ్ మొదలైన వారిని (ర'ది.'అన్హుమ్ లను) గురించి, మక్కా ముష్రిక్ నాయకులు చెప్పిన మాటలివి.