46 : 24
فَلَمَّا رَأَوۡهُ عَارِضٗا مُّسۡتَقۡبِلَ أَوۡدِيَتِهِمۡ قَالُواْ هَٰذَا عَارِضٞ مُّمۡطِرُنَاۚ بَلۡ هُوَ مَا ٱسۡتَعۡجَلۡتُم بِهِۦۖ رِيحٞ فِيهَا عَذَابٌ أَلِيمٞ
ఆ తరువాత వారు ఒక దట్టమైన మేఘాన్ని వారి లోయల వైపునకు రావటం చూసి ఇలా అన్నారు: "ఈ మేఘం మాకు వర్షం ఇస్తుంది!" (హూద్ అన్నాడు): "కాదు, కాదు! మీరు దేనికి తొందరపెడుతున్నారో అది (ఆ శిక్ష) ఇదే! ఒక తుఫాను గాలి, అందులో బాధాకరమైన శిక్ష ఉంది;
Explanation & meanings · 1
- 'ఆయి'షహ్ (ర.'అన్హా), దైవప్రవక్త ('స'అస) తో అన్నారు: "ప్రజలు మేఘాలను చూసి సంతోషపడతారు. కానీ మేఘాలను చూసినప్పుడు మీరు ('స'అస) ఆందోళన పడుతారెందుకు?" దానికి అతను ('స'అస) జవాబిచ్చారు: " 'ఆయి'షహ్ (ర.'అన్హా) ఈ మేఘాలలో అల్లాహ్ (సు.తా.) శిక్ష లేదనే హామీ ఏమీ లేదు కదా! ఒక జాతి గాలి శిక్షతో నాశనం చేయబడింది కదా! వారు కూడా మేఘాలను చూసి అన్నారు: 'ఈ మేఘాలు మాపై వర్షం కురిపిస్తాయి.' " ('స.బు'ఖారీ, 'స. ముస్లిం) మేఘాలను చూసినప్పుడు దైవప్రవక్త ('స'అస) దు'ఆ చేసేవారు. దీనికి చూడండి, 69:6-8, 7:72, 11:53-56.