Skip to content
సూరాల జాబితా /

الزُّمَر

الزُّمَر is chapter 39 of the Quran and has 75 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

75 ఆయతులు సూరా సంఖ్య 39
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

تَنزِيلُ ٱلۡكِتَٰبِ مِنَ ٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَكِيمِ

ఈ గ్రంథ (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది.

إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ فَٱعۡبُدِ ٱللَّهَ مُخۡلِصٗا لَّهُ ٱلدِّينَ

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్ నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో!

أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلۡخَالِصُۚ وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ

వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు.

Explanation & meanings · 3
  1. సిఫారస్: అల్లాహ్ (సు.తా.) దగ్గర ఎవరి సిఫారసూ చెల్లదు. ఆయన అనుమతించిన వారి సిఫారస్ తప్ప! వారు దైవదూతలు గానీ ప్రవక్తలు గానీ లేక సద్పురుషులు కావచ్చు. కాని ముఖ్య విషయమేమిటంటే, అల్లాహ్ (సు.తా.), తనకు తప్ప ఇతరులకు ఆరాధన / దాస్యం , చేయటాన్ని ఎన్నటికీ క్షమించడు. దైవత్వంలో ఆయనకు భాగస్వాములను కల్పిస్తే, ఆయన (సు.తా.) దానిని ఎన్నటికీ క్షమించడు. అది తప్ప ఇతర ఏ పాపాన్నైనా, తాను కోరిన వారిని క్షమించవచ్చు!
  2. అంటే ఆరాధించిన వారి మరియు ఆరాధించబడే వారి మధ్య, తీర్పు చేస్తాడు. ఇంకా చూడండి, 34:31-33.
  3. చూడండి, 6:22-24

لَّوۡ أَرَادَ ٱللَّهُ أَن يَتَّخِذَ وَلَدٗا لَّٱصۡطَفَىٰ مِمَّا يَخۡلُقُ مَا يَشَآءُۚ سُبۡحَٰنَهُۥۖ هُوَ ٱللَّهُ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّارُ

ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే, తన సృష్టిలో తాను కోరిన వానిని ఎన్నుకొని ఉండేవాడు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన అల్లాహ్! అద్వితీయుడు, తన సృష్టి మీద సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు.

Explanation & meanings · 2
  1. చూడండి, 6:100. అల్లాహ్ (సు.తా.) సంతానపు లోభానికి అతీతుడు. నిరపేక్షాపరుడు.
  2. చూడండి, 6:18 వ్యాఖ్యానం 1.

خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۖ يُكَوِّرُ ٱلَّيۡلَ عَلَى ٱلنَّهَارِ وَيُكَوِّرُ ٱلنَّهَارَ عَلَى ٱلَّيۡلِۖ وَسَخَّرَ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ كُلّٞ يَجۡرِي لِأَجَلٖ مُّسَمًّىۗ أَلَا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡغَفَّٰرُ

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. ఆయన రాత్రిని పగటి మీద చుట్టుతున్నాడు. మరియు పగటిని రాత్రి మీద చుట్టుతున్నాడు. సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు. వాటిలో ప్రతి ఒక్కటీ ఒక నిర్ణీత కాలంలో (నిర్ణీత పరిధిలో) పయనిస్తూ ఉన్నాయి. వినండి! ఆయన, సర్వశక్తిమంతుడు, క్షమించేవాడు.

Explanation & meanings · 2
  1. చూడండి, 10:5.
  2. చూడండి, 7:54