Skip to content
يُوسُف /

ఆయత్ 100

12 : 100

ఆయత్ 100 of يُوسُف (12 : 100). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

يُوسُف ఆయతులు 111
సూరా · يُوسُف
తెలుగు · Muhammad
12 : 100

وَرَفَعَ أَبَوَيۡهِ عَلَى ٱلۡعَرۡشِ وَخَرُّواْ لَهُۥ سُجَّدٗاۖ وَقَالَ يَٰٓأَبَتِ هَٰذَا تَأۡوِيلُ رُءۡيَٰيَ مِن قَبۡلُ قَدۡ جَعَلَهَا رَبِّي حَقّٗاۖ وَقَدۡ أَحۡسَنَ بِيٓ إِذۡ أَخۡرَجَنِي مِنَ ٱلسِّجۡنِ وَجَآءَ بِكُم مِّنَ ٱلۡبَدۡوِ مِنۢ بَعۡدِ أَن نَّزَغَ ٱلشَّيۡطَٰنُ بَيۡنِي وَبَيۡنَ إِخۡوَتِيٓۚ إِنَّ رَبِّي لَطِيفٞ لِّمَا يَشَآءُۚ إِنَّهُۥ هُوَ ٱلۡعَلِيمُ ٱلۡحَكِيمُ

మరియు అతను తన తల్లిదండ్రులను సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. మరియు వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. మరియు (యూసుఫ్) అన్నాడు: "ఓ నా తండ్రీ! నేను పూర్వం కన్న కల యొక్క భావం ఇదే కదా! నా ప్రభువు వాస్తవంగా దానిని సత్యం చేసి చూపాడు. మరియు వాస్తవంగా నన్ను చెరసాన నుండి బయటికి తీసి కూడా నాకు ఎంతో మేలు చేశాడు; నాకూ మరియు నా సోదరుల మధ్య షైతాను విరోధం కలిగించిన తరువాత (ఇప్పుడు) మిమ్మల్ని ఎడారి నుండి (ఇక్కడకు) తెచ్చాడు. నిశ్చయంగా, నా ప్రభువు సూక్ష్మగ్రాహి తాను కోరినది యుక్తితో నెరవేర్చుతాడు. నిశ్చయంగా ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

Explanation & meanings · 2
  1. ఈ సాష్టాంగం కేవలం ఒకరి పట్ల ఉన్న గౌరవాన్ని చూపటానికి చేసింది. ఈ విధంగా గౌరవం చూపడం య'అఖూబ్ ('అ.స.) షరీయత్ లో అనుమతించబడి వుండెను. కాని ము'మ్మద్ ('స'అస) షరీయత్ లో గౌరవార్థం కూడా ఎవరి ముందైనా సాష్టాంగం చేయటం ధర్మసమ్మతం కాదు.
  2. ఈజిప్టుతో పోల్చితే ఆ కాలంలో కానాన్ ఒక ఎడారి మాదరిగానే ఉండెను. అల్ బద్ వు: ఎడారి, (చూ. 12:100); అల్ బాదు: ఎడారి వాసుడు, (చూ. 22:25); బాదూన్ (బ.వ.) : ఎడారి వాసులు ( చూ. 33:20). అల్ అ'అరాబ్, అంటే, కూడా ఎడారివాసులు (బద్దూలు, చూ. 9:90).