Skip to content
يُوسُف /

ఆయత్ 50

12 : 50
يُوسُف ఆయతులు 111
సూరా · يُوسُف
తెలుగు · Muhammad
12 : 50

وَقَالَ ٱلۡمَلِكُ ٱئۡتُونِي بِهِۦۖ فَلَمَّا جَآءَهُ ٱلرَّسُولُ قَالَ ٱرۡجِعۡ إِلَىٰ رَبِّكَ فَسۡـَٔلۡهُ مَا بَالُ ٱلنِّسۡوَةِ ٱلَّٰتِي قَطَّعۡنَ أَيۡدِيَهُنَّۚ إِنَّ رَبِّي بِكَيۡدِهِنَّ عَلِيمٞ

రాజు ఇలా అన్నాడు: "అతనిని నా వద్దకు తీసుకు రండి!" రాజదూత అతని వద్దకు వచ్చినపుడు (యూసుఫ్) అన్నాడు: "నీవు తిరిగి పోయి నీ స్వామిని అడుగు: 'తమ చేతులు కోసుకున్న స్త్రీల వాస్తవ విషయం ఏమిటి?' నిశ్చయంగా, నా ప్రభువుకు వారి కుట్ర గురించి బాగా తెలుసు."

Explanation & meanings · 1
  1. యూసుఫ్ ('అ.స.) నిందితుడిగానే, కేవలం రాజు కనికరం వల్లనే కారాగారం నుండి విముక్తి పొందదలచుకోలేదు. అతను తనపై మోపబడిన నిందల నుండి పవిత్రుడనని, నిరూపించదలచు కున్నారు. కాబట్టి జవాబిచ్చారు: "అయితే, తమ చేతులు కోసుకున్న స్త్రీల వాస్తవ విషయమేమిటి" అని. ఇదే సత్యవంతులు పవిత్రులు అయిన అల్లాహ్ (సు.తా.) దా'ఈల విధానం.