Skip to content
సూరాల జాబితా /

النَّاس

النَّاس is chapter 114 of the Quran and has 6 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

6 ఆయతులు సూరా సంఖ్య 114
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ

ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!

Explanation & meanings · 1
  1. రబ్బున్: పర్ వర్ దిగార్ (ఉర్దూ), పోషకుడు, చాలా మట్టుకు తెలుగు అనువాదాలలో ఈ పదానికి ప్రభువు అని అనువాదం చేశారు. మానవుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి వానిని సరిదిద్ది పోషిస్తాడు. మరియు అతని అంతిమ ఘడియ వరకు పోషిస్తాడు. కేవలం మానవుడే కాక సమస్త సృష్టికి కూడా పోషకుడు ఆయనే!

مَلِكِ ٱلنَّاسِ

మానవుల సార్వభౌముడు!

Explanation & meanings · 1
  1. ఇటువంటి పోషకుడే వారి సార్వభౌముడు.

إِلَٰهِ ٱلنَّاسِ

మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)!"

مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ

కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి;

ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ

ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!

Explanation & meanings · 1
  1. అల్-వస్ వాసు: అంటే మెల్లని ధ్వనితో మాట్లాడటం, గుసగుసలాడటం, షై'తాన్ కూడా మానవునికి తెలియకుండానే అతని హృదయంలో చెడ్డ ఆలోచనలు రేకెత్తిస్తాడు, ఇదే వస్ వస. అల్-'ఖన్నాస్: నెమ్మదిగా జారుకునే వాడు, అంటే షై'తాన్.