Skip to content

العباس بن عبد المطلب بن هاشم

الإسم

అల్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం

اسم الشهرة

అబుల్ ఫజ్ల్ అల్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

అబుల్ ఫజ్ల్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్ బిన్ అబ్ద్-మనాఫ్ ఖురషీ హాషిమి, ఒక గొప్ప సహాబీ మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాబాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే రెండు సంవత్సరాల ముందు జన్మించారు. అజ్ఞాన కాలంలో యాత్రికులకు నీళ్ళు త్రాగించేవారు మరియు కాబా సంరక్షణ బాధ్యత నిర్వహించేవారు. ఉఖ్బా ప్రమాణంలో అన్సారులతో పాల్గున్నారు అప్పటికీ ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. ఇష్టం లేకపోయినా బదర్ ముష్రికులతో యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్ధంలో ఖైదుచేయబడ్డారు. పరిహారం చెల్లించి తను మరియు తన మేనల్లుడు అఖీల్ బిన్ అబూ తాలిబ్ విముక్తి పొందారు మరియు మక్కాకు తిరిగి వెళ్లారు.కొందరు: ఆ తరువాత అతను ముస్లిం అయ్యాడని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియకుండా దాచాడని చెప్పారు. మక్కా నుండి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమాచారం వ్రాసి పంపేవారు. మక్కా విజయానికి కొన్ని రోజులకు ముందు మదీనాకు హిజ్రతు చేశారు. ఫత్హే మక్కాలో పాల్గొన్నారు. హునైన్ రోజున ప్రజలు పారిపోతున్నప్పుడు స్థైర్యాన్ని కనబరచారు.మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అబ్బాసును కష్టపెట్టినవాడు బాధపెట్టినవాడు నన్ను బాధ పెట్టినట్లే.ఎందుకంటే బాబాయి అంటే తండ్రితో సమానం". హిజ్రీ 32న మరణించారు.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (4/ 3) الكنى والأسماء للإمام مسلم (2/ 673) تاريخ دمشق لابن عساكر (26/ 273) الأعلام للزركلي (3/262) الإصابة في تمييز الصحابة (3/511).