Skip to content

الرميصاء أو الغميصاء بنت ملحان الأنصارية

الإسم

అర్రుమైసా లేక అల్ గుమైసా బింతె మిల్హాన్ అల్ అన్సారియా.

اسم الشهرة

ఉమ్మె సులైమ్ రజియల్లాహు అన్హా.

نبذة مختصرة

ఉమ్మె సులైమ్ బింతె మిల్హాన్ బిన్ ఖాలిద్ బిన్ జైద్ అల్ అన్సారియా. అనస్-రజియల్లాహు అన్హు-కు తల్లి మరియు ఉమ్మె హరామ్'కు సోదరి. ఒక గొప్ప సహాబియా.దైవప్రవక్త -సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అనేక హదీసులు ఉల్లేఖించారు. ఆమె బిరుదు గుమైసా. కొంతమంది రుమైసా అని చెప్పారు. ఆమె పేరు సహల.అని మరికొందరు రమ్లా అని, ఇంకొందరు రుమైసా, మరికొందరు ఉనైఫా, మరికొందరు ములైకా అని కూడా చెప్పారు. అనస్-రజియల్లాహు అన్హు- నుండి ఉల్లేఖించబడిన ఒక కథనంలో, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నేను స్వర్గంలోకి ప్రవేశించినప్పుడు ఒకరి పాదాల సవ్వడి విన్నాను. అది ఎవరు అని నేను అడిగాను? దానికి అనస్ తల్లి గుమైసా బింతే మిల్హాన్ అని సమాధానం లభించింది" అల్లాహ్ యొక్క ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం - మదీనా నగరంలోని ఏ ఇంట్లోకి ప్రవేశించినా పురుషుల సమక్షంలో ప్రవేసిచేవారు ఉమ్మే సులైమ్ ఇంట్లో తప్ప. దీనికి కారణాన్ని అడిగినప్పుడు, ఆయన ఇలా చెప్పారు: నాకు ఆమెపై దయ కలుగుతుంది.ఆమె సోదరుడు నాతో ఉన్నప్పుడు హతమార్చబడ్డాడు". ఉమ్మే -సులైమ్ అజ్ఞాన కాలంలో (జాహిలియత్)లో మాలిక్ బిన్ నజర్ భార్యగా ఉండేది. వారిద్దరికీ అనస్-రజియల్లాహు అన్హు జన్మించారు. ఆమెకు ఇస్లాం సందేశం తెలియగానే, ఆమె తన జాతివారితో పాటు ఇస్లాం స్వీకరించింది. తన భర్తను ఇస్లాం స్వీకరించమని కోరింది. కానీ అతనికి కోపం వచ్చింది. అప్పుడు అతను షామ్ పట్టణం వైపు వెళ్లిపోయాడు. అక్కడే మరణించాడు. ఉమ్మే సులైమ్ హిజ్రీ 30వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
సహీహ్ అల్ బుఖారీ. (5/ 10 ح3679، 4/ 27 ح2844)، صحيح مسلم (4/ 1908 ح2456، 4/ 1908 ح2455)، الطبقات الكبرى (8/ 312)، فضائل الصحابة للنسائي (ص: 85)، معجم الصحابة للبغوي (1/ 43)، الجرح والتعديل لابن أبي حاتم (9/ 462)، الثقات لابن حبان (3/ 132)، معرفة الصحابة لأبي نعيم (6/ 3504)، الإعلام بفوائد عمدة الأحكام (2/ 60)، تهذيب التهذيب (12/ 471)، مغاني الأخيار في شرح أسامي رجال معاني الآثار (3/ 566)، نزهة الألباب في الألقاب (1/ 329)، الأعلام للزركلي (3/33).