الزبير بن العوام بن خويلد الأسدي
الإسم
జుబైర్ బిన్ అల్ అవ్వామ్ బిన్ ఖువైలిద్ అల్ అసది.
اسم الشهرة
జుబైర్ బిన్ అల్ అవ్వామ్ రజియల్లాహు అన్హు.
نبذة مختصرة
జుబైర్ బిన్ అవ్వామ్ బిన్ ఖువైలిద్ బిన్ అసద్ బిన్ అబ్దుల్-ఉజ్జా బిన్ ఖుసయ్యి బిన్ కిలాబ్ అల్-ఖుర్షి అసదీ, అబూ అబ్దుల్లాహ్, ఒక గొప్ప సహాబీ. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సహచరుడు మరియు సోదరుడు. దైవప్రవక్త- సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా స్వర్గపు శుభవార్తను పొందిన పదిమందిలో ఇతను ఒకరు.మరియు ఉమర్ రజియల్లాహు అన్హు ఏర్పాటుచేసిన ఆరు వ్యక్తుల సలహా కమిటీలో ఒకరుఅతను ఇస్లాం ధర్మంలోకి మారినప్పుడు అతని బాబాయి అతన్ని చాపలో చుట్టి పొగ పెట్టి ఇస్లాంను విడిచిపెట్టమని చెబుతాడు, కాని అతను: నేను ముమ్మాటికి అల్లాహ్ ను తిరస్కరించలేను అని సమాధానం ఇచ్చారు. ఉర్వా కథనం: జుబేర్ శరీరంపై మూడు పెద్ద పెద్ద లోతైన కత్తి గాయాలు ఉండేవి, నేను అందులో నా వేళ్లను పెట్టేవాడను. వాటిలో రెండు బద్ర్ రోజున మరియు ఒకటి యర్మూక్ రోజున పడ్డాయి.హిజ్రీ 36వ సంవత్సరంలో వీరమరణం పొందారు.