خالد بن الوليد بن المغيرة المخزومي
الإسم
ఖాలిద్ బిన్ అల్ వలీద్ బిన్ అల్ ముగైరా అల్ మఖ్జూమీ.
اسم الشهرة
ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు అన్హు.
نبذة مختصرة
ఖాలిద్ బిన్ వలీద్ బిన్ అల్ ముగైరా బిన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ మఖ్జూమ్ అల్ ఖుర్షీ అల్ మఖ్జూమీ సైఫుల్లాహ్, అబూసులైమాన్ ఒక గొప్ప సహాబీ. అజ్ఞాన కాలం (జాహిలియత్) లో అతను ఖురైష్ యొక్క ప్రముఖులలో ఒకరు. హుదైబియా వరకు జరిగిన అన్నీ యుద్ధాల్లో ఖురైష్ యొక్క అవిశ్వాసులతో పాటు ఉన్నారు. మరియు 7వ హిజ్రీలో ఖైబర్ విజయం తరువాత ఇస్లాం స్వీకరించారు. కొంతమంది ప్రకారం అప్పటికే ముస్లిముగా మారారు. మక్కా విజయం సందర్భంగా, అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు పాల్గుని పరీక్షలను ఎదుర్కున్నారు. అప్పుడు హునైన్ మరియు తాయిఫ్ యుద్ధాలలో ప్రవక్తతో పాల్గున్నారు. ప్రవక్త ఆజ్ఞ ప్రకారం -సల్లల్లాహు అలైహి వసల్లం - ఉజ్జా ప్రసిద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసి వచ్చారు. ప్రవక్త- సల్లల్లాహు అలైహి వసల్లం- అతని గురించి ఇలా అన్నారు: "ఖాలిద్ బిన్ వలీద్ అల్లాహ్ యొక్క మంచి దాసుడు మరియు అతని కుటుంబంలో గల మంచి వ్యక్తి. అతను అల్లాహ్ యొక్క గొప్ప ఖడ్గం. దానిని అల్లాహ్ శత్రువుల వధ కోసం ఒర నుంచి తీశాడు". అతను హిజ్రీ 21లో మరణించారు.