Skip to content

أم حرام بنت مِلْحان بن خالد الأنصارية

الإسم

ఉమ్మె హరామ్ బింతే మిల్'హాన్ బిన్ ఖాలిద్ అల్ అన్సారియ.

اسم الشهرة

ఉమ్మె హరామ్ బింతే మిల్'హాన్ రజియల్లాహు అన్హా.

نبذة مختصرة

ఉమ్మె హరామ్ బింతే మిల్'హాన్ బిన్ ఖాలిద్ బిన్ జైద్ బిన్ హరామ్ బిన్ జుందుబ్ అన్సారియా. అనస్ రజియల్లాహు అన్హు తన పిన్నమ్మ (ఖాలా) ఉమ్మే హరమ్ బింతే మిల్హాన్ ద్వారా ఉల్లేఖించారు:ఒక రోజు అల్లాహ్ యొక్క సందేశహరుడు -సల్లల్లాహు అలైహి వసల్లం - మధ్యాహ్న సమయంలో తన ఇంట్లో నిద్రపోయారు, కాసేపు తరువాత నవ్వుతూ మేల్కొన్నారు పిదప ఇలా చెప్పారు:"నా ముందుకు నా ఉమ్మతు యొక్క కొంతమంది ప్రజలు తీసుకు రాబడ్డారు వారు పచ్చని సముద్రంలో తమ సవారీలపై సింహాసనం మీద కూర్చున్న రాజులాగా కూర్చున్నారు. ఇది విన్న తరువాత, నేను ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! నన్ను వారిలో ఒకరిగా చేయమని అల్లాహ్ ను ప్రార్థించండి.అని అడిగాను' ఆతరువాత ఆమె ఇలా అంది. పిదప ఆయన నిద్రపోయారు కాసేపటి తరువాత నవ్వుతూ లేచారు. ఇది చూసి నేను, ఓ అల్లాహ్ ప్రవక్తా! మీరు దేని గురించి నవ్వుతున్నారు? అని అడిగాను. దానికి ఆయన ఇలా అన్నారు: "కొంతమంది మనుషులు నా ముందుకి తీసుకురాబడ్డారు, వారు ఆకుపచ్చని సముద్రంలో సింహాసనంపై కూర్చున్న రాజు వలె తమ సవారీలపై కూర్చున్నారు". నేను ఇలా అన్నాను: ఓ అల్లాహ్ ప్రవక్తా! నన్ను అలాంటి వారిలో ఒకరిగా చేయమని అల్లాహ్'తో ప్రార్థించండి అని అంది అని ఉల్లేఖకుడు చెప్పారు' దానికి ఆయన అన్నారు: "మీరు మొదటివారిలో ఉన్నారు". అనస్ -రజియల్లాహు అన్హు చెప్తూ -ఉబాదా బిన్ సామిత్ ఆమెను వివాహం చేసుకున్నారు. ఆమెను తనతో యుద్ధానికి తీసుకువెళ్లారు. వారు సముద్రం దాటినప్పుడు ఉమ్మేహరమ్ బింతే మిల్హాన్ ఒక జంతువుపై ప్రయాణించగా, ఆ జంతువు ఆమెని పడవేయడంతో అక్కడే మరణించారు. ఇది హిజ్రీ 27వ సంవత్సరంలో జరిగింది.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (8/ 319)، معرفة الصحابة لأبي نعيم (6/ 3479)، الاستيعاب في معرفة الأصحاب (4/ 1931)، أسد الغابة (7/ 304)، الأعلام للزركلي (2/172).