جندب بن جنادة بن سفيان بن عبيد الغفاري
الإسم
జుందుబ్ బిన్ జునాద బిన్ సుఫ్యాన్ బిన్ ఉబైద్ అల్ గిఫారీ.
اسم الشهرة
అబూ జర్ అల్ గిఫారీ రజియల్లాహు అన్హు.
نبذة مختصرة
అబూ జర్ అల్ గిఫారీ గొప్పసహాబీ. అతని ప్రసిద్ధ పేరు జుందుబ్ బిన్ జునాదా.ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారిలో ఒకరు. కొంతమంది ఇతను ఇస్లాంలోకి మారిన నాల్గవ వ్యక్తి అని మరి కొంతమంది ఐదవ వ్యక్తిగా తెలిపారు. ఈయన అల్లాహ్ యొక్క ప్రవక్త -సల్లల్లాహు అలైహి వసల్లం-కు ఇస్లాం యొక్క మొదటి సలాం చేసారు. ఇతను మక్కాలోని ప్రవక్త -సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు ప్రవక్త సందేశం విని అదే సమయంలో ముస్లింగా మారారు. దీని తరువాత అల్లాహ్ యొక్క ప్రవక్త -సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:మీరు తిరిగి వెళ్లి ఇస్లాం గురించి మీ సమాజానికి చెప్పండి, నా ఆదేశం మీకు వచ్చే వరకు. అప్పుడు అతను ఇలా అన్నాడు: నా ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా, నేను ఈ ప్రజల మధ్య బిగ్గరగా అరిచి నా ఇస్లాంను ప్రకటిస్తాను. ఇలా చెప్పి బయటకు వెళ్లి మస్జిదుకు చేరుకుని పెద్ద స్వరంతో బిగ్గరగా ఇలా ప్రకటించారు: అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్య దైవం లేనే లేడు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇది విన్న ప్రజలు అతని వైపు పరుగులు తీశారు మరియు అతనిని చాలా కొట్టారు, అతను నేలమీద పడిపోయారు. అల్లాహ్ యొక్క ప్రవక్త- సల్లల్లాహు అలైహి వసల్లం అతని పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేవారు. అతను వచ్చినప్పుడు, ప్రవక్త మొదట సలాం చేసేవారు మరియు అతను లేనప్పుడు అతని గురించి అడిగి తెలుసుకునేవారు. అతను హిజ్రీ శకం 32వ సంవత్సరంలో మరణించారు.