Skip to content

أويس بن عامر بن جزء بن مالك القرني

الإسم

ఉవైస్ బిన్ ఆమిర్ బిన్ జజ్ ఆ బిన్ మాలిక్ అల్ ఖర్నీ.

اسم الشهرة

ఉవైస్ అల్ ఖర్ని

نبذة مختصرة

అబూ అమ్ర్ ఉవైస్ బిన్ ఆమిర్ బిన్ జజ్'ఆ బిన్ మాలిక్ అల్-ఖర్నీ, చాలా గొప్ప తాబయి మరియు గొప్ప దైవభక్తులు. నిజానికి ఇతను యమన్ కు చెందినవారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలాన్ని పొందారు కానీ ప్రవక్తను చూడలేకపోయారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు కాలంలో ఆయన వద్దకు వచ్చి కూఫాలో స్థిరపడ్డారు. అతను ఒక ఉత్తమ తాబయి అని అర్థమవుతుంది. ఉసైర్ బిన్ జాబిర్ ఉల్లేఖించిన హదీసులో ఇది వివరించబడింది: ముస్లిం సైన్యానికి మద్దతు ఇవ్వడానికి యమన్ సైనికులు ఉమర్ బిన్ ఖత్తాబ్ - రజియల్లాహు అన్హు వద్దకు వచ్చినప్పుడల్లా ఉవైస్ బిన్ ఆమిర్ మీలో ఉన్నారా? అని ఆయన అడిగేవారు. చివరికి ఒకరోజు ఉవైస్ ను కలుసుకున్నారు. అప్పుడు ఆయన ఇలా అడిగారు: ఉవైస్ బిన్ ఆమిర్ అంటే మీరేనా?. దానికతను'అవును అని బదులిచ్చాడు. ఉమర్ అడిగారు: మీరు మురాద్ వంశానికి చెందిన ఖర్న్ శాఖకు చెందినవారా?. అవును అని అతను బదులిచ్చాడు. మళ్ళీ ఉమర్ అడిగారు: మీకు తెల్లమచ్చల వ్యాధి వచ్చిందా?. ఆ వ్యాధికి స్వస్థతకలిగి ఒక దిర్హమ్ కు సమానంగా మిగిలి ఉందా?. అతను'అవును' అని బదులిచ్చాడు. ఉమర్ అడిగారు: మీ అమ్మ బతికే ఉందా? అవును అని అతను బదులిచ్చాడు. ఉమర్ ఇలా చెప్పారు: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్తుండగా నేను విన్నాను:"ఉవైస్ బిన్ ఆమిర్ ముస్లిం సైన్యానికి మద్దతుగా యమన్ నుండి వచ్చే దళాలతో మీ వద్దకు వస్తాడు. అతను మురాద్ వంశానికి చెందిన ఖర్న్ శాఖకు చెందినవాడు. అతనికి తెల్లమచ్చల వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి తగ్గి నయమవుతుంది కానీ ఒక దిర్హమ్ కు సమానంగా మిగిలి ఉంటుంది. అతనికి తల్లి ఉంటుంది. అతను ఆమెకు బాగా సేవ చేస్తాడు. అతను అల్లాహ్ పై ప్రమాణం చేస్తే, అల్లాహ్ అతని ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు. కనుక అతను మీ కోసం క్షమాపణ దుఆ చేసేలా మీకు సాధ్యపడితే ఖచ్చితంగా అలా చేయండి." ఉమర్ ఉవైస్'తో ఇస్తిగ్ఫార్ చేయమని అడిగారు. ఆయన ఉమర్ కోసం దుఆ చేశారు. తరువాత ఉమర్ రజియల్లాహు అన్హు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అని అడిగారు. దానికాయన నేను కూఫా వెళ్తాను అని అన్నారు. ఇది విన్న ఉమర్ రజియల్లాహు అన్హు మీ గురించి కూఫా గవర్నర్ కి ఉత్తరం వ్రాయమంటారా?అని అడిగారు. దానికాయన నేను అపరిచితునిగా జీవించడానికే ఇష్టపడతాను అని సమాధానమిచ్చారు. ఉల్లేఖఖుడు చెప్తున్నాడు: మరుసటి సంవత్సరం తన ఆ ప్రదేశం నుండి ఒక వ్యక్తి హజ్ ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఉమర్ - రజియల్లాహు అన్హు అతన్ని కలిసి ఉవైస్ గురించి అడిగారు: దానికతను 'అతను శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు మరియు జీవనం కొనసాగించడానికి చాలా తక్కువ సామగ్రి ఉందని చెప్పాడు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు అతనితో చెప్పారు: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పడం నేను విన్నాను:"ఉవైస్ బిన్ ఆమిర్ ముస్లిం సైన్యానికి మద్దతుగా యమన్ నుండి వచ్చే దళాలతో మీ వద్దకు వస్తాడు. అతను మురాద్ వంశానికి చెందిన ఖర్న్ శాఖకు చెందినవాడు. అతనికి తెల్లమచ్చల వ్యాధి ఉంటుంది ఆ వ్యాధి తగ్గి నయమవుతుంది కానీ ఒక దిర్హమ్ కు సమానంగా మిగిలి ఉంటుంది. అతనికి తల్లి ఉంటుంది, అతను ఆమెకు బాగా సేవచేస్తాడు. అతను అల్లాహ్ పై ప్రమాణం చేస్తే, అల్లాహ్ అతని ప్రమాణాన్ని పూర్తిచేస్తాడు. కనుక అతను మీ కోసం క్షమాపణ దుఆ చేసేలా మీకు సాధ్యపడితే, ఖచ్చితంగా అలా చేయండి." పిమ్మట ఆ వ్యక్తి ఉవైస్ వద్దకి వచ్చి మీరు నా క్షమాపణ కోసం దుఆ చేయండి అని అడిగాడు. దానికాయన' మీరు ఇప్పుడిప్పుడే పవిత్రయాత్ర ముగించుకుని వచ్చారు కాబట్టి మీరే నా కోసం క్షమాపణ దుఆ చేయండి అని అన్నారు. దానికావ్యక్తి మళ్ళీ మీరు నా కోసం క్షమాపణ దుఆ చేయండి అని అడిగారు. దానికాయన మళ్ళీ ఇప్పుడే మీరు పవిత్ర ప్రయాణం ముగించుకుని వచ్చారు కాబట్టి మీరు నా క్షమాపణకై దుఆ చేయండి అని అడిగారు. అప్పుడు ఆయన మీరు ఉమర్ రజియల్లాహు అన్హు ను కలిసారా అని అడిగారు. అవును అనే సమాధానం రావడంతో అతని క్షమాపణకై దుఆ చేశారు. దీంతో ఆయన గొప్పతనాన్ని ప్రజలు తెలుసుకున్నారు. ఇది చూసి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉసైర్ చెప్తు: ఆయన వద్ద వస్త్రం రూపంలో ఒక దుప్పటి మాత్రం ఉండేదని' చెప్పాడు. ఏ వ్యక్తి తనను చూసిన, ఉవైస్ కు ఈ దుప్పటి ఎక్కడ నుండి వచ్చింది అని అడిగేవారు. ఆయన హిజ్రీ శకం 37 వ సంవత్సరం లో మరణించారు.

المراجع

ఇంకా (1)
సహీహ్ ముస్లిం. (4/ 1969، ح2542)، الطبقات الكبرى (6/204)، الطبقات لخليفة بن الخياط (ص: 246)، أسد الغابة (1/331)، سير أعلام النبلاء (4/519)، الأعلام للزركلي(2/ 32).