«జనులకు కృతజ్ఞత చూపని వాడు అల్లాహ్‌కు కృతజ్ఞత చూపడు»
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«జనులకు కృతజ్ఞత చూపని వాడు అల్లాహ్‌కు కృతజ్ఞత చూపడు»
«لَا يَشْكُرُ اللَّهَ مَنْ لَا يَشْكُرُ النَّاسَ»
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రజలు చేసిన మేలు మరియు మంచికి బదులుగా వారికి కృతజ్ఞతలు తెలుపని వాడు, సాధారణంగా అల్లాహ్'కు కూడా కృతజ్ఞత తెలుపడు. ఎందుకంటే ఈ రెండు విషయాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఎవరి స్వభావం మరియు అలవాటు ప్రజల అనుగ్రహాల పట్ల కృతఘ్నత చూపడం మరియు వారికి కృతజ్ఞతలు తెలుపకపోవడమై ఉంటుందో, అల్లాహ్ అనుగ్రహం పట్ల కృతఘ్నత చూపడం మరియు ఆయనకు కృతజ్ఞతలు తెలపడంలో లోపం చేయడం కూడా అతని అలవాటుగా ఉంటుంది.
ప్రజలు చేసిన మేలుకు కృతజ్ఞత తెలుపుటలో ప్రాముఖ్యత ఉన్నది.
వాస్తవానికి అనుగ్రహదాత అల్లాహ్ మాత్రమే మరియు సృష్టిరాశులు ఆయన తాను కోరిన వారికి వశపరిచే మాధ్యమాలు, సాధనాలు మాత్రమే, అందువలన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం కూడా అల్లాహ్'కు కృతజ్ఞతలు తెలపడంలో భాగమే.
ప్రజల ఉపకారము పట్ల కృతజ్ఞత అనేది పరిపూర్ణమైన సత్శీలానికి నిదర్శనం.
సునన్ అబీదావూద్ (7/ 188) (4811).
సునన్ అత్తిర్మిదీ. (3/ 403) (1954).
ముస్నద్ అహ్మద్ (13/ 322) (7939).
ఇంకా (2)
شرح سنن أبي داود لابن رسلان (18/ 490).
شرح سنن أبي داود للعباد (547/ 13).