Skip to content

నిశ్ఛయంగా స్వర్గంలో ఒక చెట్టు ఉంది, (అది ఎంత విశాలంగా ఉంటుందీ అంటే) బాగా శిక్షణ ఇవ్వబడి, బాగా సిధ్ధం చేసిన గుర్రంపై స్వారీ చేసే వ్యక్తి వంద సంవత్సరాలు ప్రయాణించినా దాని నీడను దాటలేడు.”

అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు:

"నిశ్ఛయంగా స్వర్గంలో ఒక చెట్టు ఉంది, (అది ఎంత విశాలంగా ఉంటుందీ అంటే) బాగా శిక్షణ ఇవ్వబడి, బాగా సిధ్ధం చేసిన గుర్రంపై స్వారీ చేసే వ్యక్తి వంద సంవత్సరాలు ప్రయాణించినా దాని నీడను దాటలేడు.”

«إِنَّ فِي الْجَنَّةِ شَجَرَةً يَسِيرُ الرَّاكِبُ الْجَوَادَ الْمُضَمَّرَ السَّرِيعَ مِائَةَ عَامٍ مَا يَقْطَعُهَا».

అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: “స్వర్గంలో ఒక చెట్టు ఉంది, దాని కింద వేగంగా పరుగెత్తే గుర్రంపై ప్రయాణించే వ్యక్తి వంద సంవత్సరాలు ప్రయాణించినా కూడా, దాని చివరి కొమ్మను చేరుకోలేడు.”.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ఈ హదీథులో స్వర్గం యొక్క విశాలత మరియు దానిలోని వృక్షముల పరిమాణం యొక్క వివరణ ఉన్నది.

సమీక్షకుడు

సహీహ్ అల్ బుఖారీ. (8/ 114) (6553).

సహీహ్ ముస్లిం. (4/ 2176) (2828).

ఇంకా (6)

نزهة المتقين شرح رياض الصالحين.

لمجموعة من الباحثين (2/ 1289).

بهجة الناظرين شرح رياض الصالحين.

لسليم الهلالي (3/ 345).

تطريز رياض الصالحين.

لفيصل مُبَارَك (ص1086).