Skip to content
సూరాల జాబితా /

المُطَففين

المُطَففين is chapter 83 of the Quran and has 36 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

36 ఆయతులు సూరా సంఖ్య 83
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

وَيۡلٞ لِّلۡمُطَفِّفِينَ

కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది.

ٱلَّذِينَ إِذَا ٱكۡتَالُواْ عَلَى ٱلنَّاسِ يَسۡتَوۡفُونَ

వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.

وَإِذَا كَالُوهُمۡ أَو وَّزَنُوهُمۡ يُخۡسِرُونَ

మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.

Explanation & meanings · 1
  1. ఒక 'హదీస్'లో ఇలా ఉంది: "ఏ సమాజం వారైతే కొలతలలో మరియు తూనికలలో తగ్గిస్తారో! వారిపై కరువు మరియు పరిపాలకుల ఆగడాలు విరుచుకు పడతాయి." (ఇబ్నె - మాజా - అల్బానీ దీనిని 'స'హీ'హ్ గా ప్రమాణీకరించారు) ఈ మూడు ఆయతులు అన్ని రకాల మోసాలను ఖండిస్తున్నాయి.

أَلَا يَظُنُّ أُوْلَٰٓئِكَ أَنَّهُم مَّبۡعُوثُونَ

ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా?

لِيَوۡمٍ عَظِيمٖ

ఒక గొప్ప దినమున!