Skip to content
సూరాల జాబితా /

القَمَر

القَمَر is chapter 54 of the Quran and has 55 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

55 ఆయతులు సూరా సంఖ్య 54
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

ٱقۡتَرَبَتِ ٱلسَّاعَةُ وَٱنشَقَّ ٱلۡقَمَرُ

ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు.

Explanation & meanings · 1
  1. ఈ అద్భుత నిదర్శనం, మక్కావాసుల కోరికపై దైవప్రవక్త ('స'అస) చూపించారు. ('స. ముస్లిం)

وَإِن يَرَوۡاْ ءَايَةٗ يُعۡرِضُواْ وَيَقُولُواْ سِحۡرٞ مُّسۡتَمِرّٞ

అయినా (సత్యతిరస్కారులు), అద్భుత సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. మరియు: "ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్రజాలమే." అని అంటున్నారు.

وَكَذَّبُواْ وَٱتَّبَعُوٓاْ أَهۡوَآءَهُمۡۚ وَكُلُّ أَمۡرٖ مُّسۡتَقِرّٞ

మరియు వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛలను అనుసరించారు. మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది.

Explanation & meanings · 1
  1. ప్రతి కార్యానికి పర్యవసానం ఉంది. అంటే మంచికి మంచి ప్రతిఫలం మరియు చెడుకు శిక్ష. ఈ ప్రతిఫలం ఈ లోకంలోనే లభించవచ్చు లేనిచో పరలోకంలో తప్పకుండా లభిస్తుంది.

وَلَقَدۡ جَآءَهُم مِّنَ ٱلۡأَنۢبَآءِ مَا فِيهِ مُزۡدَجَرٌ

మరియు వాస్తవానికి, వారి వద్దకు సమాచారాలు వచ్చాయి. అందు వారికి మందలింపులు ఉండేవి.

حِكۡمَةُۢ بَٰلِغَةٞۖ فَمَا تُغۡنِ ٱلنُّذُرُ

కావలసినంత వివేకమూ ఉండేది. కాని ఆ హెచ్చరికలు వారికి ప్రయోజనకరం కాలేదు.