تميم بن أوس بن خارجة الداري
الإسم
తమీమ్ బిన్ ఔస్ బిన్ ఖారిజహ్ అద్దారి.
اسم الشهرة
అబూ రుఖయ్య తమీమ్ బిన్ ఔస్ అద్దారీ రజియల్లాహు అన్హు.
نبذة مختصرة
ఆయన పేరు అబూ రుఖయ్య తమీమ్ బిన్ ఔస్ బిన్ హరిసా, కొంతమంది ఖారిజా బిన్ సౌద్ గా, మరికొందరి ప్రకారం సవాద్ బిన్ జజీమా బిన్ జిరాఆ బిన్ అద్ది బిన్ అద్దార్ గా పేర్కొవడం జరిగింది, అబూ రుఖయ్య అద్దారి ఒక గొప్ప సహబీ. అతను మొదట ఒక క్రైస్తవుడు. తరువాత మదీనాకు వచ్చిఇస్లాం స్వీకరించారు. అతను అల్లాహ్ యొక్క ప్రవక్త -సల్లల్లాహు అలైహి వసల్లంకు మొదట జస్సాస మరియు దజ్జాల్ యొక్క సంఘటనను వివరించారు. సహాబాలందరూ దైవ ప్రవక్త నుండి హదీసులు వివరిస్తారు, అయితే ఈ ఒక్క హదీసు మాత్రం అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని నుండి విన్న తరువాత మింబర్ పై ఎక్కి వివరించారు. అందువల్ల ఇది అతని ప్రత్యేకతలలో ఒకటిగా పరిగణించబడుతుంది. తహజ్జుద్ నమాజులు ఎక్కువగా చేసేవారు. ఒకసారి రాత్రంతా ఒక్క ఆయతును చదువుతూ నమాజు చేస్తూ గడిపారు. ఆ ఆయతు ఇది :{أَمْ حَسِبَ الَّذِينَ اجْتَرَحُوا السَّيِّئَاتِ أَنْ نَجْعَلَهُمْ كَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَوَاءً مَحْيَاهُمْ وَمَمَاتُهُمْ سَاءَ مَا يَحْكُمُونَ[అల్-జాసియా: 21], 40వ హిజ్రి సంవత్సరంలో మరణించారు.