Skip to content

تماضر بنت عمرو بن الحارث بن الشريد

الإسم

తుమాజిర్ బిన్తె అమ్ర్ బిన్ అల్ హారిస్ బిన్ షురైద్.

اسم الشهرة

అల్ ఖన్సా.

نبذة مختصرة

తుమాజిర్ బిన్తె అమ్ర్ బిన్ హారిస్ బిన్ షురైద్ అర్-రియాహియా సులమియా. ఖన్సా అనే బిరుదు పొంది అదే పేరుతో ప్రఖ్యాతిగాంచారు. అరేబియా ప్రాంతపు నజ్ద్'తెగకు చెందిన అత్యంత ప్రసిద్ధ కవయిత్రి ఆమె. ఆమె తన జీవితపు అధికకాలం అజ్ఞాన కాలం(జాహిలియత్) లో గడిపారు. ఆమె తన ఇద్దరు సోదరులైన సఖర్ మరియు ముఆవియా మరణంపై మరసియా(సానుభూతి గీతం) చెప్పడంతో ప్రసిద్ధి చెందారు. ఇస్లాం సందేశాన్ని అందుకున్నప్పుడు ఆమె స్వీకరించి ముస్లింగా మారారు. ఆమె తన తెగ బనూ సులైమ్ వాసులతో కలిసి అల్లాహ్ యొక్క ప్రవక్త- సల్లల్లాహు అలైహి వ సల్లం వద్దకు చేరుకుంది. ఆమెకు నలుగురు కుమారులు ఉన్నారు.వారు 16వ హిజ్రీలో ఖాదిసియా యుద్ధంలో పాల్గూన్నారు.అప్పుడు వారికి స్థైర్యంగా ఉండి వారిని పోరాడమని ప్రోత్సహిస్తూనే ఉంది. చివరికీ , నలుగురూ షహీదు అయ్యారు అమరవీరులైనప్పుడు ఆమె ఇలా చెప్పింది:(الحمد للَّه الذي شرفني بقتلهم)"అల్లాహ్ కు అనేక కృతజ్ఞతలు. ఆ నలుగురి షహాదతు ద్వారా నాకు గౌరవాన్ని ప్రసాదించాడు" ఆమె హిజ్రీ 24వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الاستيعاب (4/1827) وفيات الأعيان (6/34) الوافي بالوفيات (10/240) الإصابة في تمييز الصحابة (8/109) الأعلام للزركلي (2/ 86).