Skip to content

కోపం తెచ్చుకోకు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:

“ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “నాకు ఏమైనా బోధించండి” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు” (కోపానికి దూరంగా ఉండు) అని పలికారు. అతడు పలుమార్లు అదే ప్రశ్నను అడిగాడు. ప్రతీ సారీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు” (కోపానికి దూరంగా ఉండు) అని సమాధానమిచ్చారు.

أَنَّ رَجُلًا قَالَ لِلنَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَوْصِنِي، قَالَ: «لَا تَغْضَبْ» فَرَدَّدَ مِرَارًا قَالَ: «لَا تَغْضَبْ».

అల్ బుఖారీ నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

సహబాలలో ఒకరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, తనకు ప్రయోజనం కలిగించే ఏదైనా విషయం వైపునకు మార్గదర్శకత్వం చేయమని కోరాడు. దానికి ఆయన “కోపం తెచ్చుకోకు (కోపానికి దూరంగా ఉండు)” అని అతణ్ణి ఆదేశించారు. దాని అర్థము తనను కోపానికి గురిచేసే ప్రతి కారణము నుండి దూరంగా ఉండమని, ఒకవేళ కోపం వచ్చినట్లయితే దానిని నియంత్రించు కోవాలని. అంతే గానీ, దానినే అంటిపెట్టుకుని ఉండి ఆ కోపంలో ఎవరినైనా చంపడమో, కొట్టడమో లేక అవమాన పరచడమో చేయరాదు అని అర్థము. ఆ మనిషి తనకు ఏదైనా బోధించమనే తన అభ్యర్ధనను పలుమార్లు పునరావృతం చేసాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు (కోపానికి దూరంగా ఉండు)” అనే తన ఆదేశానికి ఇంకేమీ జోడించలేదు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ఇందులో క్రోధానికి వ్యతిరేకంగా హెచ్చరిక ఉన్నది. క్రోధం అన్ని రకాల చెడుల కలయిక అని, దాని నుండి దూరంగా ఉండడం అన్ని రకాల మేళ్ళ కలయిక అని తెలుస్తున్నది.

అల్లాహ్ కొరకు క్రోధానికి గురి కావడం అంటే అల్లాహ్ నిషేధించిన విషయాల ఉల్లంఘన జరిగినపుడు క్రోధానికి గురి కావడం. అది కొనియాడ దగినదే.

ఒకే విషయాన్ని పలుమార్లు పునరావృతంగా చెప్పడం అనేది, వినే వ్యక్తి ఆ విషయం యొక్క గాంభీర్యాన్ని, ప్రాముఖ్యతను గుర్తించే వరకు చేయడం కొన్ని సార్లు అవసరం అవుతుంది.

ఇందులో, తనకు మేలు జరిగే ఏదైనా విషయాన్ని బోధించమని ఒక ఙ్ఞానవంతుని అభ్యర్థించడం యొక్క ఘనత కనిపిస్తుంది.

సమీక్షకుడు

సహీహ్ అల్ బుఖారీ. (8/ 28) (6116).

(2/ 1038).

ఇంకా (8)

التحفة الربانية في شرح الأربعين حديثًا النووية (ص36).

شرح الأربعين النووية.

لابن عثيمين (ص181).

فتح القوي المتين في شرح الأربعين وتتمة الخمسين.

للعباد (ص64).

المعجم الوسيط.

تاج العروس من جواهر القاموس.

للزبيدي (3/ 485).