57 : 13
يَوۡمَ يَقُولُ ٱلۡمُنَٰفِقُونَ وَٱلۡمُنَٰفِقَٰتُ لِلَّذِينَ ءَامَنُواْ ٱنظُرُونَا نَقۡتَبِسۡ مِن نُّورِكُمۡ قِيلَ ٱرۡجِعُواْ وَرَآءَكُمۡ فَٱلۡتَمِسُواْ نُورٗاۖ فَضُرِبَ بَيۡنَهُم بِسُورٖ لَّهُۥ بَابُۢ بَاطِنُهُۥ فِيهِ ٱلرَّحۡمَةُ وَظَٰهِرُهُۥ مِن قِبَلِهِ ٱلۡعَذَابُ
ఆ రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులతో ఇలా అంటారు: "మీరు మా కొరకు కొంచెం వేచి ఉండండి, మేము మీ వెలుగు నుండి కొంచెం తీసుకుంటాము." వారితో ఇలా అనబడుతుంది: "మీరు వెనుకకు మరలి పొండి, తరువాత వెలుగు కొరకు వెదకండి!" అప్పుడు వారి మధ్య ఒక గోడ నిలబెట్టబడుతుంది. దానికి ఒక ద్వారముంటుంది, దాని లోపలి వైపు కారుణ్యముంటుంది మరియు దాని బయటవైపు శిక్ష ఉంటుంది.
Explanation & meanings · 4
- చూడండి, 29:11.
- కపటవిశ్వాసులైన స్త్రీపురుషులు కొంతదూరం విశ్వాసుల వెలుగులో నడిచిన తరువాత, అల్లాహ్ (సు.తా.) వారిపై చీకటిని విధిస్తాడు. అప్పుడు వారు అలా పలుకుతారు.
- అంటే స్వర్గం.
- అంటే నరకం.