57 : 18
إِنَّ ٱلۡمُصَّدِّقِينَ وَٱلۡمُصَّدِّقَٰتِ وَأَقۡرَضُواْ ٱللَّهَ قَرۡضًا حَسَنٗا يُضَٰعَفُ لَهُمۡ وَلَهُمۡ أَجۡرٞ كَرِيمٞ
నిశ్చయంగా, విధి దానం (జకాత్) చేసే పురుషులు మరియు విధిదానం చేసే స్త్రీలు మరియు అల్లాహ్ కు మంచి అప్పు ఇచ్చే వారికి, ఆయన దానిని ఎన్నో రెట్లు పెంచి (తిరిగి) ఇస్తాడు. మరియు వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
Explanation & meanings · 1
- ఒకదానికి పదిరెట్లు, ఐదువందల రెట్లు లేక అంతకంటే అధికంగా కూడా ఇస్తాడు. ఈ ఎక్కువరెట్ల పుణ్యం వారి మాలిన్యరహితం, ఆవశ్యకత మరియు ఖర్చు చేసిన చోటు మరియు కాలాన్ని బట్టి ఉంటాయి. ఏ విధంగానైతే ఇంతకు ముందు పేర్కొనబడిందో ఫ'త్హ్ మక్కాకు మొదట ఖర్చు చేసిన వారికి, దాని తరువాత ఖర్చుచేసిన వారికంటే ఎక్కువ పుణ్యముందని.