Skip to content
సూరాల జాబితా /

الهُمَزة

الهُمَزة is chapter 104 of the Quran and has 9 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

9 ఆయతులు సూరా సంఖ్య 104
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

وَيۡلٞ لِّكُلِّ هُمَزَةٖ لُّمَزَةٍ

అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.

Explanation & meanings · 1
  1. హుమ'జహ్ మరియు లుమ'హజ్: కొందరి అభిప్రాయంలో ఒకే అర్థం గలవి. మరి కొందరు వాటి మధ్య భేదం చూపుతారు. హుమ'జహ్ - అంటే ముఖం మీద అపనిందలు చేసేవారు. లుమ'జహ్ - అంటే వీపు వెనుక చాడీలు చెప్పేవారు. మరికొందరు హుమ'జహ్ - అంటే కండ్ల సైగలతో, చేతి సైగలతో దూషించటం మరియు లుమ'జహ్ - అంటే నోటి మాటలతో దూషించటం, అని అంటారు.

ٱلَّذِي جَمَعَ مَالٗا وَعَدَّدَهُۥ

ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!

Explanation & meanings · 1
  1. అంటే 'జకాతు మరియు 'సదఖాత్ ఇవ్వకుండా ఉంటాడో!

يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ

తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!

Explanation & meanings · 1
  1. అ'ఖ్ లదహ్: అంటే అది అతనిని మరణించకుండా చేస్తుందని భావిస్తాడు.

كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ

ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.

Explanation & meanings · 1
  1. చూఅల్-'హు'తమతు: నరకాగ్ని పేర్లలో ఒకటి. చూడండి, 15:43-44. ముక్కలు ముక్కలుగా చేసేది.

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ

ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?

Explanation & meanings · 1
  1. ఆ అగ్ని ఎంతో భయంకరమైనది. దాని తీవ్రతను బట్టి మీ బుద్ధి అర్థం చేసుకోజాలదు.