النعمان بن ثابت الكوفي الإمام
الإسم
నౌమాన్ బిన్ సాబిత్ అల్ కూఫీ అల్ ఇమామ్
اسم الشهرة
అబూ హనీఫా
نبذة مختصرة
అబూహనీఫా నౌమాన్ బిన్ సాబిత్ బిన్ జూతీ కూఫీ. ఈ ఉమ్మతు యొక్క గొప్పఇమాం మరియు ఫఖీహ్. గొప్ప ఆరాధకుడు,భక్తిపరులు. హరాం పనుల నుండి వారించేవారు. అతనికి ప్రపంచాన్ని మరియు చాలా సంపదను సమర్పించారు కానీ దాని గురించి అసలు పట్టించుకోలేదు. ఖజాఅతు లేదా బైతుల్ మాల్ యొక్క బాధ్యతను తీసుకోమని కొరడాలతో కొట్టబడ్డారు. కానీ నిరాకరించారు. ఇమామ్ జహబీ ఇలా చెప్పారు:(ఆయన జీవిత చరిత్రను వ్రాయడానికి రెండు సంపుటాలు కావాలి.అల్లాహ్ ఆయన పట్ల సంతృప్తి చెందాడు ఆయనపై దయ చూపుగాక)ఇమామ్ అహ్మద్ ఇలా చెప్పారు: (అబూ హనీఫా జ్ఞానం, భక్తి , జుహ్ద్ మరియు పరలోక ప్రాధాన్యతలో ఆయనను ఎవరూ చేరుకోలేని ఉన్నత స్థానంలో ఉన్నారు, మన్సూర్ నుండి పదవీ బాధ్యతలు స్వీకరించనందుకు కొరడాలతో దెబ్బలు తినవలసి వచ్చింది, కానీ అంగీకరించలేదు. అల్లాహ్ దయాకారుణ్యాలు ఆయన పై వర్షించుగాక.) ఇమామ్ షాఫయీ ఇలా అన్నారు:(ఇమాం మాలిక్ బిన్ అనస్'ను మీరు అబూ హనీఫాను చూశారా ఆయనతో చర్చించారా?అని అడగబడింది. దానికాయన అవును, నేను ఒక వ్యక్తిని చూశాను, ఒకవేళ అతను ఈ రాతి స్తంభాన్ని చూసి ఇది బంగారు స్తంభం అని చెబితే అది హుజ్జతు అవుతుంది.) హిజ్రీ 150వ సంవత్సరంలో ఆయన మరణించారు.