Skip to content

أم حكيم بنت الحارث بن هشام

الإسم

ఉమ్మె హకీం బింతె అల్ హారిస్ బిన్ హిషామ్.

اسم الشهرة

ఉమ్మె హకీం బింతె అల్ హారిసు రజియల్లాహు అన్హా.

نبذة مختصرة

ఉమ్మె హకీం బింతె అల్ హారిస్ బిన్ హిషామ్ బిన్ అల్ ముగైరా అల్ మఖ్జూమియా ఒక గొప్ప సహాబియా.ఉహుద్ యుద్ధం రోజున ముష్రిక్లతో కలిసి పాల్గూన్నారు.మక్కా విజయం రోజున ముస్లింగా మారారు. ఆ రోజు ఆమె భర్త ఇక్రిమా బిన్ అబూజహ్ల్ యమన్ వైపు పారిపోయారు. ఆమె అల్లాహ్ యొక్క ప్రవక్త- సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతితో అతని వద్దకు వెళ్ళింది. అప్పుడు అతను ఆమెతో పాటు ప్రవక్త ముందుకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. ఉమ్మె హకీం రూమీలతో పోరాడటానికి తన భర్తతో బయటకు వెళ్ళినప్పుడు, ఆమె భర్త షహీదుగా అమరుడయ్యారు, ఆ తరువాత ఖాలిద్ బిన్ సయీద్ బిన్ అల్ ఆస్ ఆమెను దిమిష్క్ కు పడమరన మరజుస్సఫర్ యుద్ధానికి కొంతకాలం ముందు వివాహం చేసుకున్నారు. ఈ యుద్ధంలో ఖాలిద్ బిన్ సయీద్ వీరమరణం పొందారు అప్పుడు ఉమ్మే హకీమ్ తన బట్టలు కట్టి, హిజాబ్ ధరించారు, అయితే వివాహ సమయంలో ఉపయోగించిన పరిమళాలు ఆమె శరీరంపై ఇంకా సువాసనలు వెదజల్లుతూనే మిగిలి ఉన్నాయి.నది వద్ద ఒక వంతెనపై యుద్దం జరిగింది. ఈ యుద్ద సంఘటన తరువాత ఉమ్మే హకీమ్ వంతెనగా అది పిలువబడింది, యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా, ఖాలిద్ తనతో కలిసి గడిపిన అదే శిభిరంలోని ఒక స్తంభంతో ఏడుగురు రూమీలను హతమార్చింది. ఆమె హిజ్రీ 14వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (8/ 205)، الاستيعاب في معرفة الأصحاب (4/ 1932)، أسد الغابة (7/ 309)، الإصابة في تمييز الصحابة (8/ 379)، الأعلام للزركلي (2/269).