حسان بن ثابت بن المنذر
الإسم
హస్సాన్ బిన్ సాబిత్ బిన్ అల్ ముంజిర్.
اسم الشهرة
హస్సాన్ బిన్ సాబిత్.
نبذة مختصرة
హస్సాన్ బిన్ సాబిత్ బిన్ అల్ ముంజిర్ బిన్ హరామ్ అల్ అన్సారీ, అల్ ఖజ్రజీ పిదప నజ్జారి. దైవప్రవక్త-సల్లల్లాహు అలైహి వసల్లం యొక్కకవి. కునియతులు అబుల్-వలీద్,అబుల్-ముజర్రబ్,అబుల్-హుసామ్ మరియు అబూ అబ్దుర్రహ్మాన్, అయితే మొదటిది చాలా ప్రసిద్ధి. అల్లాహ్ యొక్క ప్రవక్త -సల్లల్లాహు అలైహి వసల్లం -హస్సాన్ - రజియల్లాహు అన్హు కోసం మింబరు మస్జిదులో పెట్టించారు, దానిపై అతను ఎక్కి దైవప్రవక్తను నిందిస్తూ దూషించేవారికి ఎగతాళి చేసేవారికి తన కవిత్వంతో బదులిచ్చేవారని సహీహ్ హదీసులతో రుజువు అవుతుంది.ఈ సందర్భంలో, ఒక రోజు అల్లాహ్ యొక్క ప్రవక్త -సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు :"హస్సాన్ దైవప్రవక్తను సమర్థిస్తున్నంత కాలం అల్లాహ్ యొక్క దూత జిబ్రయీల్ అలైహిస్సలాం అతనిని సంరక్షిస్తూ ఉంటాడు ". ఇబ్ను సఅద్ ఇలా అన్నారు: అతను అరవై సంవత్సరాలు అజ్ఞాన కాలంలో (జాహిలియత్) మరియు ఇస్లాం స్వీకరించిన తరువాత అరవై సంవత్సరాలు జీవించారు. ఈ విధంగా అతను 120 సంవత్సరాల వయస్సులో, హిజ్రీ 54 లో మరణించారు.