“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ర్ సలాహ్ కు ముందు నాలుగు (రకాతులు), మరియు ఫజ్ర్ సలాహ్’కు ముందు రెండు రకాతులు నమాజు ఆచరించడాన్ని ఎన్నడూ విడిచి పెట్టలేదు.”
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ర్ సలాహ్ కు ముందు నాలుగు (రకాతులు), మరియు ఫజ్ర్ సలాహ్’కు ముందు రెండు రకాతులు నమాజు ఆచరించడాన్ని ఎన్నడూ విడిచి పెట్టలేదు.”
أن النبي صلى الله عليه وسلم كان لا يَدع أربعا قَبل الظهر وركعتين قبل الغَدَاة.
ఈ హదీథులో ఆయిషా (రదియల్లాహు అన్హా) : తన ఇంటిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వచ్ఛందంగా ఆచరించవలసిన నమాజులను ఎన్నడూ విడిచి పెట్టలేదని, ఆయన నిరంతరం వాటిని ఆచరించేవారని తెలియ జేస్తున్నారు; జుహ్ర్ సలాహ్ కు ముందు రెండు-రెండు రకాతులుగా నాలుగు రకాతుల సున్నత్ సలాహ్, మరియు ఫజ్ర్ సలాహ్ కు ముందు రెండు రకాతుల సున్నత్ సలాహ్ నిరంతరం ఆచరించేవారని తెలియజేస్తున్నారు.
జుహ్ర్ సలాహ్ కు ముందు నాలుగు రకాతులు సున్నత్ సలాహ్, మరియు ఫజ్ర్ సలాహ్ కు ముందు రెండు రకాతుల సున్నత్ సలాహ్ నిరంతరం ఆచరించడం అభిలషణీయము.
స్వచ్ఛంద నమాజులను (సున్నత్ మరియు నఫీల్ నమాజులను) ఇంటిలో ఆచరించుట ఉత్తమం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిధంగా ఇంటిలోనే ఆచరించేవారు కనుకనే ఆయిషా (రదియల్లాహు అన్హా) దానిని గురించి ఉల్లేఖించినారు.
సహీహ్ అల్ బుఖారీ. (2/ 59) (1182).
ఇంకా (2)
توضيح الأحكام مِن بلوغ المرام.
لعبد الله البسام (2/ 379).