“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రమం తప్పకుండా ఫజ్ర్ యొక్క రెండు రకాతుల సున్నతు నమాజు కంటే ఎక్కువగా ఏ సున్నతు నమాజును పాటించలేదు
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రమం తప్పకుండా ఫజ్ర్ యొక్క రెండు రకాతుల సున్నతు నమాజు కంటే ఎక్కువగా ఏ సున్నతు నమాజును పాటించలేదు.
لَمْ يَكُنِ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى شَيْءٍ مِنَ النَّوَافِلِ أَشَدَّ مِنْهُ تَعَاهُدًا عَلَى رَكْعَتَيِ الفَجْرِ.
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదిస్తున్నారు: ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతుల సున్నతు నమాజు ఆచరించినంత స్థిరంగా, శ్రద్ధగా మరియు జాగ్రత్తగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ స్వచ్ఛంద నమాజును కూడా ఎన్నడూ నిర్వహించలేదు.
నవాఫిల్ (సున్నతు) నమాజులు: ఫర్జ్ నమాజులు మినహా, మిగతా అన్ని నమాజులు కూడా నవాఫిల్ నమాజులు అనే అనబడతాయి. ఇక్కడ ‘నవాఫిల్’ అంటే ఫర్జ్ నమాజులతో అనుబంధం కలిగి ఉన్న సున్నత్ నమాజులు అని అర్థం.
సున్నత్ అర్'రవాతిబ్ నమాజులు (సున్నతె ముఅక్కదహ్ నమాజులు): ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు; జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు (రెండు రెండు రకాతుల చొప్పున); జుహ్ర్ నమాజు తరువాత రెండు రకాతులు; మగ్రిబ్ నమాజు తరువాత రెండు రకాతులు మరియు ఇషా నమాజు తరువాత రెండు రకాతులు.
జుహ్ర్, మగ్రిబ్ మరియు 'ఇషా' కోసం చేసే సున్నత్ నమాజుల మాదిరిగా కాకుండా, ఫజ్ర్ కు ముందు సాధారణంగా ఆచరించబడే రెండు రకాతుల సున్నతు నమాజు స్థానికంగా ఉన్నా మరియు ప్రయాణంలో ఉన్నా కూడా ఆచరించాలి, అయితే జుహ్ర్, మగ్రిబ్ మరియు 'ఇషా' నమాజులతో పాటు ఆచరించబడే సున్నత్ నమాజులు స్థానికంగా ఉన్నపుడు మాత్రమే ఆచరించబడతాయి.
‘సున్నతె ముఅక్కదహ్’ నమాజులలో ఫజ్ర్ నమాజు కంటే ముందు ఆచరించబడే రెండు రకాతుల సున్నతు నమాజు యొక్క ఆచరణ బలంగా సిఫారసు చేయబడినది. కనుక దానిని ఆచరించుట ఎన్నడూ నిర్లక్ష్యము చేయరాదు.
సహీహ్ అల్ బుఖారీ. (2/ 57) (1169).
సహీహ్ ముస్లిం. (1/ 501) (724).
ఇంకా (4)
تيسير العلام شرح عمدة الأحكام.
لعبد الله البسام (ص113).
تنبيه الأفهام شرح عمدة الأحكام.
لابن عثيمين (1/ 144).