Skip to content

“నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ‘ఇస్తింజా’ చేయడానికి (శుభ్రపరుచుకోవడానికి) పేడ లేదా ఎముకను ఉపయోగించడాన్ని నిషేధించినారు

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:

“నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ‘ఇస్తింజా’ చేయడానికి (శుభ్రపరుచుకోవడానికి) పేడ లేదా ఎముకను ఉపయోగించడాన్ని నిషేధించినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ రెండూ శుద్ధపరచవు.”

إِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نَهَى أَنْ يُسْتَنْجَى بِرَوْثٍ أَوْ عَظْمٍ، وَقَالَ: «إِنَّهُمَا لَا تُطَهِّرَانِ».

దారు ఖుత్నీ నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

మూత్ర విసర్జన లేదా మల విసర్జన ద్వారా ఉపశమనం పొందిన తరువాత ఎవరైనా శుభ్రపరుచు కోవడానికి జంతువు ఎముకను, పేడను లేదా పిడకను ఉపయోగించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నిషేధించారు. ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా అన్నారు: “అవి అశుద్ధతను దూరం చేయవు అలాగే అవి ఎవరినీ అశుద్ధత నుండి పరిశుద్ధ పరచవు కూడా.”

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ఈ హదీథులో మరుగుదొడ్డిని ఉపయోగించుటకు సంబంధించి మరియు ఇస్తింజాకు (కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత శుభ్రపరుచుకోవడానికి) సంబంధించి కొన్ని మర్యాదలు వివరించబడినాయి.

పేడను, పిడకలను ఇస్తింజా కోసం ఉపయోగించడం నిషేధించబడింది, ఎందుకంటే అది అపవిత్రమైనది లేదా జిన్నాతుల జంతువులకు మేత కాబట్టి.

ఎముకలను ఇస్తింజా కోసం ఉపయోగించడం నిషేధించబడింది, ఎందుకంటే ఎముకలు అశుధ్ధమైనవి లేదా అవి స్వయంగా జిన్నాతుల ఆహారం కాబట్టి.

సమీక్షకుడు

సునన్ అద్దారల్ ఖుత్నీ (1/ 88) (152).

ఇంకా (6)

توضيح الأحكام مِن بلوغ المرام.

لعبد الله البسام (1/ 355).

سبل السلام.

للصنعاني (1/ 118).

مرقاة المفاتيح شرح مشكاة المصابيح.

لعلي القاري (1/ 374).