మేము సమాజములలో చివరివారము మరియు లెక్క తీసుకోబడేవారిలో మొట్టమొదటి వారము
ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
మేము సమాజములలో చివరివారము మరియు లెక్క తీసుకోబడేవారిలో మొట్టమొదటి వారము, ఇలా అనబడుతుంది: నిరక్షరాస్య సమాజం మరియు దాని ప్రవక్త ఎక్కడ? కావున మేము చివరివారము మరియు మొదటివారము.
«نَحْنُ آخِرُ الأُمَمِ، وَأَوَّلُ مَنْ يُحَاسَبُ، يُقَالُ: أَيْنَ الأُمَّةُ الأُمِّيَّةُ وَنَبِيُّهَا؟ فَنَحْنُ الآخِرُونَ الأَوَّلُونَ».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, వారి సమాజము కాలపరంగా చివరి సమాజము మరియు ప్రళయదినాన మొట్టమొదట లెక్క తీసుకోబడే సమాజము కూడా అదే. ప్రళయదినాన ఇలా పిలవబడుతుంది: 'నిరక్షరాస్య సమాజం మరియు దాని ప్రవక్త ఎక్కడ ఉన్నారు?'. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదవడం, రాయడం తెలియని నిరక్షరాస్యులు కావడాన్ని బట్టి ఈ సమాజానికి ఆ పేరు వచ్చింది. కాబట్టి మనము మొదట లెక్క కోసం పిలవబడతాము. మనము ఈ ప్రపంచంలో చిట్టచివరి వాళ్ళము, కానీ తీర్పు రోజున లెక్కలో మరియు స్వర్గంలో ప్రవేశించడంలో మొదటివాళ్ళం.
గత సమాజాలపై ఈ ఉమ్మత్ యొక్క విశిష్టత.
ఇంకా (3)
حاشية السندي على سنن ابن ماجه (2/575).
ذخيرة العقبى في شرح المجتبى (16/52).
مرشد ذوي الحجا والحاجة إلى سنن ابن ماجه (26/241).