Skip to content
సూరాల జాబితా /

المُزمل

المُزمل is chapter 73 of the Quran and has 20 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

20 ఆయతులు సూరా సంఖ్య 73
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

يَٰٓأَيُّهَا ٱلۡمُزَّمِّلُ

ఓ దుప్పటి కప్పుకున్నవాడా!

Explanation & meanings · 1
  1. ఈ సూరహ్ అవతరింపజేయబడినప్పుడు దైవప్రవక్త ('స'అస) దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటారు. అతనికి లేచి తహజ్దుద్ నమా'జ్ చేయమని ఆజ్ఞ ఇవ్వబడింది. తహజ్జుద్ అతని కొరకు వాజిబ్-తప్పనిసరి చేయబడి ఉండెను. (ఇబ్నె-కసీ'ర్).

قُمِ ٱلَّيۡلَ إِلَّا قَلِيلٗا

రాత్రంతా (నమాజ్ లో) నిలబడు, కొంత భాగాన్ని విడిచి;

نِّصۡفَهُۥٓ أَوِ ٱنقُصۡ مِنۡهُ قَلِيلًا

దాని సగభాగంలో, లేదా దాని కంటే కొంత తక్కువ;

أَوۡ زِدۡ عَلَيۡهِ وَرَتِّلِ ٱلۡقُرۡءَانَ تَرۡتِيلًا

లేదా దాని కంటే కొంత ఎక్కువ; మరియు ఖుర్ఆన్ ను ఆగి ఆగి నెమ్మదిగా స్పష్టంగా పఠించు.

إِنَّا سَنُلۡقِي عَلَيۡكَ قَوۡلٗا ثَقِيلًا

నిశ్చయంగా, మేము నీపై భారమైన సందేశాన్ని అవతరింప జేయబోతున్నాము.