Skip to content
సూరాల జాబితా /

الجِن

الجِن is chapter 72 of the Quran and has 28 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

28 ఆయతులు సూరా సంఖ్య 72
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ أُوحِيَ إِلَيَّ أَنَّهُ ٱسۡتَمَعَ نَفَرٞ مِّنَ ٱلۡجِنِّ فَقَالُوٓاْ إِنَّا سَمِعۡنَا قُرۡءَانًا عَجَبٗا

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "నాకు ఈ విధంగా దివ్యసందేశం పంపబడింది; నిశ్చయంగా, ఒక జిన్నాతుల సమూహం - దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విని - తమ జాతి వారితో ఇలా అన్నారు: 'వాస్తవానికి మేము ఒక అద్భుతమైన పఠనం (ఖుర్ఆన్) విన్నాము!

Explanation & meanings · 1
  1. నఫరున్: అంటే 3 నుండి 10 వరకు ఉండే సంఖ్యల సమూహం. నఖ్ లా లోయలో దైవప్రవక్త ('స'అస) తమ అనుచరు(ర.'ది.'అన్హుమ్)లతో సహా ఫజ్ర్ నమా'జ్ చేస్తుండగా అక్కడి నుండి కొందరు జిన్నాతులు పోతూ వారి ఖుర్ఆన్ విని ప్రభావితులయి విశ్వసిస్తారు. ఈ విషయం 46:29 లో వచ్చింది. జిన్నాతులు ఖుర్ఆన్ విన్నది దైవప్రవక్త ('స'అస) కు తెలియదు. అది వ'హీ ద్వారా తెలుపబడిందని ఇక్కడ పేర్కొనబడింది.

يَهۡدِيٓ إِلَى ٱلرُّشۡدِ فَـَٔامَنَّا بِهِۦۖ وَلَن نُّشۡرِكَ بِرَبِّنَآ أَحَدٗا

అది సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. కావున మేము దానిని విశ్వసించాము. మరియు మేము మా ప్రభువుకు ఎవ్వడిని కూడా భాగస్వామిగా సాటి కల్పించము.

Explanation & meanings · 1
  1. ఖుర్ఆన్ ను వినగానే జిన్నాతులు విశ్వసించారు. కాని మానవులు మాత్రం దానిని మళ్ళీ మళ్ళీ విని కూడా విశ్వసించడం లేదు.

وَأَنَّهُۥ تَعَٰلَىٰ جَدُّ رَبِّنَا مَا ٱتَّخَذَ صَٰحِبَةٗ وَلَا وَلَدٗا

మరియు నిశ్చయంగా, మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. ఆయన ఎవ్వడినీ భార్యగా (సాహిబతున్ గా) గానీ, కుమారునిగా గానీ చేసుకోలేదు.

وَأَنَّهُۥ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى ٱللَّهِ شَطَطٗا

మరియు నిశ్చయంగా, మనలోని అవివేకులు, కొందరు అల్లాహ్ విషయంలో దారుణమైన మాటలు పలుకుతున్నారు.

وَأَنَّا ظَنَنَّآ أَن لَّن تَقُولَ ٱلۡإِنسُ وَٱلۡجِنُّ عَلَى ٱللَّهِ كَذِبٗا

మరియు వాస్తవానికి మనం మానవులు గానీ, జిన్నాతులు గానీ అల్లాహ్ ను గురించి అబద్ధం పలకరని భావించేవారము.