41 : 11
ثُمَّ ٱسۡتَوَىٰٓ إِلَى ٱلسَّمَآءِ وَهِيَ دُخَانٞ فَقَالَ لَهَا وَلِلۡأَرۡضِ ٱئۡتِيَا طَوۡعًا أَوۡ كَرۡهٗا قَالَتَآ أَتَيۡنَا طَآئِعِينَ
అప్పుడే ఆయన కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపునకు తన ధ్యానాన్ని మరల్చి, దానిని మరియు భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు: "మీరిద్దరు (ఉనికిలోకి) రండి మీకు ఇష్టమున్నా, ఇష్టం లేక పోయినా!" అవి రెండూ: "మేమిద్దరమూ విధేయులమై (ఉనికిలోకి) వస్తాము." అని అన్నాయి.
Explanation & meanings · 2
- సు'మ్మ: 'అరబ్బీ భాషలో ఒకే విషయాన్ని బోధించే రెండు వాక్యాలను కలుపుటకు గూడా ఈ శబ్దం సు'మ్మ వాడబడుతోంది. ఇక్కడ వాడబడినట్లు.
- దఖానున్: పొగ, ఇది హైడ్రోజన్ గ్యాస్ కావచ్చు. దీని నుండియే ప్రపంచంలోని మూలపదార్థాలు (Elements) అన్నీ రూపొందించబడ్డాయి. చూడండి, 2:29.