41 : 16
فَأَرۡسَلۡنَا عَلَيۡهِمۡ رِيحٗا صَرۡصَرٗا فِيٓ أَيَّامٖ نَّحِسَاتٖ لِّنُذِيقَهُمۡ عَذَابَ ٱلۡخِزۡيِ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَلَعَذَابُ ٱلۡأٓخِرَةِ أَخۡزَىٰۖ وَهُمۡ لَا يُنصَرُونَ
చివరకు మేము వారికి, ఇహలోక జీవితంలోనే అవమానకరమైన శిక్ష రుచి చూపించాలని, అశుభమైని దినాలలో వారిపై తీవ్రమైన తుఫాను గాలిని పంపాము. మరియు వారి పరలోక శిక్ష దీని కంటే ఎంతో అవమానకరమైనదిగా ఉండబోతుంది. మరియు వారికెలాంటి సహాయం లభించదు.
Explanation & meanings · 1
- తూఫాన్ గాలి వీటిన దినాలు ఆ సత్యతిరస్కారుల కొరకే అశుభమైనవి. కాని ఆ పేరు గల దినాలు అందరి కొరకూ అశుభమైనవని దీని అర్థం కాదు. వివరాలకు చూడండి, 69:6-8.