Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 4 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
«నేను మీకు ఉపవాసం, నమాజు మరియు దానధర్మాల స్థాయి కంటే ఉత్తమమైన దాని గురించి తెలియజేయనా?» వారు, “తప్పకుండా తెలియజేయండి” అన్నారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «పరస్పర సంబంధాలను చక్కదిద్దడం, ఎందుకంటే పరస్పర సంబంధాలు చెడిపోవడమే వినాశము».
ప్రామాణికమైన హదీథు అబూదావూద్ మరియు అత్తిర్మిదీ నమోదు చేసినారు:
“బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో బంధుత్వపు బంధాన్ని తెంచుకున్న బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“నిశ్చయంగా అల్లాహ్ మీ కొరకు మూడు విషయాలను ఇష్టపడతాడు, మరియు మూడు విషయాలను అసహ్యించుకుంటాడు మీకొరకు ఇష్టపడేవి: మీరు ఆయనను మాత్రమే ఆరాధించుట; దేనినీ మరియు ఎవరినీ మీరు ఆయనకు సమానులుగా నిలబెట్టకుండుట; మరియు మీరు ఆయన త్రాటిని బలంగా పట్టుకుని కలిసికట్టుగా ఉండుట, మరియు విడిపోకుండా ఉండుట; ఆయన మీ కొరకు అసహ్యించుకునే విషయాలు: వ్యర్ధ సంభాషణ (పోసుకోలు మాటలు); అడుక్కొనుట, లేదా అతిగా ప్రశ్నించుట; మరియు సంపదను వ్యర్ధముగా ఖర్చు చేయుట.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“మీ సొదరుడు అణచివేతదారుడైనా, లేక అణచివేతకు గురియైన వాడైనా అతనికి మద్దతునివ్వండి”. ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “ఓ రసూలుల్లాహ్! అతడు అణచివేతకు గురియైన వాడైతే మద్దతు నిస్తాను. కానీ అణచివేతదారునికి ఎలా మద్దతునివ్వాలి?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతడిని అణచివేత నుండి ఆపడం ద్వారా, లేదా అతడిని అణచివేత నుండి నిరోధించడం ద్వారా. నిశ్చయంగా ఇది అతనికి మద్దతునివ్వడం అవుతుంది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: