“శుభ్రపరుచుకోవడానికి మూడు కంటే తక్కువ రాళ్ళను ఉప్యోగించరాదని” ఆదేశించినారు.”
సల్మాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“బహుదైవారాధకులు మాతో (ఎగతాళిగా) ఇలా అన్నారు: “మీ సహచరుడు (మీ ప్రవక్త) మీకు ప్రతి విషయం బోధిస్తున్నట్టు మేము చూస్తున్నాము, చివరికి కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలి అనే(చిన్న) విషయం కూడా?” దానికి ఆయన (సల్మాన్) ఇలా జవాబిచ్చినారు: “అవును; నిశ్చయంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి విషయం బోధిస్తారు; కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత శుభ్రపరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించరాదని; ఖిబ్లాహ్ వైపునకు ముఖంగానీ వీపుగానీ చేయరాదని నిషేధించినారు; మరియు శుభ్రపరుచుకోవడానికి పేడను, పిడకలను, ఎముకలను ఉపయోగించరాదని నిషేధించినారు; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా: “శుభ్రపరుచుకోవడానికి మూడు కంటే తక్కువ రాళ్ళను ఉప్యోగించరాదని” ఆదేశించినారు.”
قَالَ لَنَا الْمُشْرِكُونَ: إِنِّي أَرَى صَاحِبَكُمْ يُعَلِّمُكُمْ حَتَّى يُعَلِّمَكُمُ الْخِرَاءَةَ، فَقَالَ: أَجَلْ، إِنَّهُ نَهَانَا أَنْ يَسْتَنْجِيَ أَحَدُنَا بِيَمِينِهِ، أَوْ يَسْتَقْبِلَ الْقِبْلَةَ، وَنَهَى عَنِ الرَّوْثِ وَالْعِظَامِ وَقَالَ: «لَا يَسْتَنْجِي أَحَدُكُمْ بِدُونِ ثَلَاثَةِ أَحْجَارٍ».
సల్మాన్ అల్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “బహుదైవారాధకులు ఎగతాళిగా మాతో ఇలా అన్నారు: “మీ ప్రవక్త మీకు ప్రతి విషయాన్ని బోధిస్తారు, చివరికి మూత్రవిసర్జన లేక మలవిసర్జన చేసి ఉపశమనం ఎలా పొందాలి అనే విషయం కూడా!” సల్మాన్ రదియల్లాహు అన్హు ఇలా జవాబిచ్చినారు: “అవును, ఆయన మాకు కాలకృత్యాలు తీర్చుకుని మనం ఉపశమనం పొందే విధివిధానాలను, మర్యాదలను నేర్పించినారు. వాటిలో భాగంగా కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత శుభ్రపరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించరాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు, దానిని అశుద్ధత నుండి దూరంగా ఉంచడానికి మరియు దానిపట్ల ఉన్న గౌరవం కారణంగా; అలాగే కాలకృత్యాలు తీర్చుకొను నపుడు (మల విసర్జన మరియు మూత్ర విసర్జన చేయునపుడు) కాబహ్ గృహం వైపునకు ముఖం చేయరాదు అని నిషేధించినారు; శుభ్రపరుచుకోవడానికి జంతువుల పేడను, పిడకలను లేదా మలాన్ని లేదా ఎముకలను ఉపయోగించరాదు అని నిషేధించినారు; మరియు శుభ్రపరుచుకోవడానికి మూడు రాళ్ళ కంటే తక్కువ ఉపయోగించరాదు అని నిషేధించినారు.”
ఇది ప్రజలకు అవసరమైన ప్రతి విషయంలోనూ ఇస్లామీయ చట్టం యొక్క సమగ్రత మరియు పరిపూర్ణతను వివరించే ప్రకటన.
ఇందులో మలవిసర్జన మరియు ఇస్తింజ' యొక్క కొన్ని మర్యాదల, విధివిధానాల వివరణ ఉన్నది.
ఈ హదీథులో "ఆయన మమ్మల్ని నిషేధించినారు" అనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటన ఆధారంగా, మూత్ర విసర్జన లేదా మలవిసర్జన చేస్తున్నప్పుడు ఖిబ్లాహ్ వైపు తిరగడం నిషేధం: మరియు నిషేధం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే అది నిషేధమే.
‘ఇస్తింజా’ (మలమూత్రాదుల విసర్జన తరువాత చేతితో శుభ్రపరుచుకోవడం), లేదా ‘ఇస్తిజ్’మార్’ (మలమూత్రాదుల విసర్జన తరువాత శుభ్రపరుచుకోవడానికి రాళ్ళను ఉపయోగించుట) కొరకు కుడి చేతితో శుభ్రపరచుకోవడం, కుడిచేతి పట్ల గౌరవం కారణంగా నిషేధించబడింది.
ఎడమ చేయి కంటే కుడి చేయి ప్రాధాన్యత కలిగి ఉంటుంది, ఎందుకంటే ఎడమ చేయి మలినాలను మరియు అశుద్ధ పదార్థాలను తొలగించడానికి ఉపయోగించబడుతుంది మరియు కుడి చేయి ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది.
మలినము చిన్నదా పెద్దదా అనే విషయంతో సంబంధం లేకుండా మలినాలను నీరు లేదా రాళ్లతో తొలగించడం విధి (వాజిబ్).
మూడు కంటే తక్కువ రాళ్లతో ఇస్తింజా చేయడం నిషేధము, ఎందుకంటే మూడు కంటే తక్కువ రాళ్లు సాధారణంగా శుద్ధి పూర్తి చేయవు.
పరిశుద్ధత మరియు పరిశుభ్రత అనే లక్ష్యాలను సాధించే ఏ ఒనరులైనా, ఆ లక్ష్యాన్ని సాధించేటట్లయితే, పరిశుద్ధతను, పరిశుభ్రతను పొందడానికి అవి సరిపోతాయి. ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా రాళ్ళను ప్రస్తావించారు; ఎందుకంటే ఆ కాలంలో అవి అతి సాధారణంగా వాడుకలో ఉండినవి, ఉపయోగించబడినవి కనుక. అందువల్ల ఈ హదీథులో లభించే ఆదేశం (రూలింగ్) కేవలం వాటికి మాత్రమే పరిమితం కాదు.
ఇస్తిజ్మార్‌ను (కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత రాళ్ళతో శుభ్రపరుచుకొనుటను) బేసి సంఖ్యతో ముగించాలని సిఫార్సు చేయబడింది. కనుక, ఉదాహరణకు నాలుగు రాళ్ళతో శుభ్రత సాధించినట్లయితే, ఐదవ రాయిని జోడించాలి. దీనికి ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ప్రకటన: (“ఎవరైతే ఇస్తిజ్మార్ చేస్తారో అతడు బేసి సంఖ్యతో అలా చేయాలి”).
పేడతో ఇస్తిజ్మార్ చేయడం నిషేధించబడింది, ఎందుకంటే అది అపవిత్రమైనది లేదా జిన్నాతుల జంతువులకు మేత కాబట్టి.
ఎముకతో ఇస్తిజ్మార్ చేయడం (మలవిసర్జన తరువాత, రాళ్ళకు బదులు ఎముకతో ఆ భాగాన్ని శుభ్రం చేయుట) నిషేధించబడింది, ఎందుకంటే అది అపవిత్రమైనది లేదా స్వయంగా జిన్నులకు ఆహారం కాబట్టి.
సహీహ్ ముస్లిం. (1/ 224) (262).
ఇంకా (14)
مشارق الأنوار على صحاح الآثار.
عياض بن موسى اليحصبي السبتي.
معجم اللغة العربية المعاصرة.
أحمد مختار عبد الحميد عمر بمساعدة فريق عمل.
توضيح الأحكام شرح بلوغ المرام.
عبد الله بن عبد الرحمن البسام.
تسهيل الإلمام بفقه الأحاديث من بلوغ المرام.
صالح بن فوزان بن عبد الله الفوزان.
فتح ذي الجلال والإكرام شرح بلوغ المرام.
محمد بن صالح العثيمين.
منحة العلام في شرح بلوغ المرام.
عبد الله صالح الفوزان.
شرح سنن أبي داود.
عبد المحسن بن حمد بن عبد المحسن العباد.