మీరు పరస్పరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోండి, అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
మీరు పరస్పరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోండి, అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
«تَهَادَوا تَحَابُّوا».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ముస్లింలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలని ప్రోత్సహించారు. మరియు బహుమతులు ప్రేమను పెంచే మరియు హృదయాలను కలిపే కారణాలలో ఒకటి (అని తెలియజేశారు).
బహుమతి నివ్వడం అభిలషణీయము, అభినందనీయము. ఎందుకంటే దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞాపించారు.
బహుమతి అనేది ప్రేమకు ఒక కారణం.
ఒక వ్యక్తి తనకు మరియు ప్రజలకు మధ్య ప్రేమానురాగాలను పెంపొందించేందుకు, తనకు సాధ్యమైనంతలో వారికి బహుమతి ఇవ్వడం, వారితో మృదువుగా వ్యవహరించడం మరియు మంచి మాటలు మాట్లాడటం లేదా చిరునవ్వుతో వారిని పలకరించడం వంటివి చేయాలి.
సునన్ అల్ కుబ్రా అల్ బైహిఖీ (6/ 169).
ఇంకా (5)
الأدب المفرد للبخاري (ص:208) (594).
مسند أبي يعلى الموصلي (11/ 9) (6148).
فتح ذي الجلال والإكرام بشرح بلوغ المرام (4/ 319).
فيض القدير (3/ 271).
التيسير بشرح الجامع الصغير (1/ 457).