"ఎవరైనా మన ఈ ధర్మంలో (ఇస్లాం) భాగం కాని ఏదైనా కొత్త విషయాన్ని ప్రవేశపెడితే, అది తిరస్కరించబడుతుంది.
ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైనా మన ఈ ధర్మంలో (ఇస్లాం) భాగం కాని ఏదైనా కొత్త విషయాన్ని ప్రవేశపెడితే, అది తిరస్కరించబడుతుంది." ముస్లింలో నమోదు చేయబడిన హదీథులో ఇలా ఉన్నది: "మా ఆజ్ఞకు అనుగుణంగా లేని పనిని ఎవరు చేసినా, అది తిరస్కరించబడుతుంది."
«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ». وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ: «مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ».
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఎవరైనా ఈ ధర్మములో (ఇస్లాంలో) ఏదైనా కొత్త విషయాన్ని సృష్టించినట్లయితే, లేదా ఖుర్’ఆన్ మరియు సున్నత్’లలో ప్రామాణికము లేని ఏదైనా ఆచరణను ఆచరించినా, అది ఈ ధర్మము యొక్క యజమాని (అల్లాహ్) చే తిరస్కరించబడుతుంది, మరియు ఆయన వద్ద (అల్లాహ్ వద్ద) అది ఆమోదయోగ్యము కాదు.
ఇస్లాంలో ఏ ఆరాధనైనా (ఇబాదత్ ఐనా) ఖుర్’ఆన్ మరియు సున్నత్’లో పేర్కొనబడిన విధానం పైనే ఆధారపడి ఉంటుంది. కనుక మనం సర్వోన్నతుడైన అల్లాహ్ ను ఆయన ఆదేశించిన విధంగానే ఆరాధిస్తాము. అంతే గానీ, ఖుర్’ఆన్ మరియు సున్నత్ లలో పేర్కొనబడని విధంగా లేదా కొత్తగా సృష్టించబడిన కల్పిత ఆరాధనల ద్వారా ఆయనను ఆరాధించము.
ధర్మము (ఇస్లాం) "అభిప్రాయాలపై మరియు ‘ఈ విధంగా ఆరాధించడం మంచిది’ అని లేదా ‘ఈ పద్ధతిలో ఆరాధించడం కూడా సరైనదే’ అని భావించడం" మొదలైన వాటిపై ఆధారపడి ఉండదు. ధర్మము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపిన విధానంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
ఇస్లాం ధర్మం పరిపూర్ణమైన ధర్మమని ఈ హదీథు నిరూపిస్తున్నది (పరిపూర్ణమైన దానిలోనికి మరింకే కొత్త విషయం లేక విధానం యొక్క అవసరం ఉండదు).
“బిద్’అత్” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో గానీ లేక ఆయన సహాబాల కాలములో గానీ ఇస్లాం లో లేని విషయమూ, ఆ తరువాత అందులోనికి కొత్తగా ప్రవేశపెట్టబడిన ప్రతి విషయమూ “బిద్’అత్” అనబడుతుంది; అది విశ్వాసానికి సంబంధించిన కొత్త విషయం గానీ, లేక ధర్మానికి సంబంధించి కొత్త పలుకులు, మాటలు, పదాలు గానీ, లేక కొత్త ఆచరణలు గానీ.
ఈ హదీసు ఇస్లాం యొక్క మూలస్థంభాల వంటి నియమాలలో ఒకటి – అది ఇస్లాం లో ఆచరణలకు సంబంధించి ఒక త్రాసు (మీజాన్) వంటిది. ఏ ఆచరణైనా అది కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత, మరియు ఆయన సామీప్యము పొందుట కొరకు మాత్రమే సంకల్పించబడినదై ఉండాలి. అలా కాకపోయినట్లయితే ఆచరించిన వానికి దాని పుణ్యఫలములో ఏమీ లభించదు. అదే విధంగా ఏ ఆచరణైనా అది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపిన విధానానికి అనుగుణంగా ఉండాలి. అలా కాకపోయినట్లయితే అది ఆచరించిన వాని పైనే త్రిప్పి కొట్టబడుతుంది అంటే తిరస్కరించబడుతుంది.
ఈ హదీథు, ధర్మంలో కొత్తగా కల్పించబడిన బిద్అత్‌లను మరియు తప్పుడు పనులను తిరస్కరించడానికి ఒక ప్రాథమిక నియమం (ఆధారం) గా నిలుస్తుంది.
ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే – కొత్త విషయాలు నిషేధము అంటే, అది ధర్మానికి చెందిన కొత్త విషయాలు అని. అంతే కాని ఈ ప్రపంచానికి సంబంధించిన కొత్త విషయాలు నిషేధము అని కాదు అర్థము.
సహీహ్ అల్ బుఖారీ. (3/ 184) (2697).
సహీహ్ ముస్లిం. (3/ 1343) (1718).
ఇంకా (5)
التحفة الربانية في شرح الأربعين حديثًا النووية (ص16).
شرح الأربعين النووية.
لابن عثيمين (ص96).
فتح القوي المتين في شرح الأربعين وتتمة الخمسين.
للعباد (ص38).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
23 గ్రంథాలు- ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల గురించిన పరిశోధన, విశ్లేషణ మరియు స్పష్టీకరణالتحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة - النسخة المعتمدة“ఎవడైనా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసి పుచ్చబడుతుంది” [30]
- ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల గురించిన పరిశోధన, విశ్లేషణ మరియు స్పష్టీకరణالتحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة - النسخة المعتمدة“ఎవడైనా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసి పుచ్చబడుతుంది”[124]
- మహాపాపాల నిఘంటువు“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది” [41].
ఇంకా (20)
- حراسة التوحيدإقامة البراهين على حكم من استغاث بغير الله«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ».
- حراسة التوحيدالتحذير من البدع«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنهُ فَهُوَ رَدٌّ».
- حراسة التوحيدالتحذير من البدع«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ».
- خذ عقيدتك من الكتاب والسنة الصحيحة«من أحدث في أمرنا هذا ما ليس منه فهو رَدٌّ»
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 1 «مَنْ أَحْدَثَ في أَمْرِنا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدّ».
- شرح الأربعين النووية«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ».
- شرح الأصول الثلاثة«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ» [35]
- عقيدة الأئمة الأربعة«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ»
- عقيدة التوحيد(من أحدث في أمرنا هذا ما ليس منه فهو رد)
- عقيدة التوحيد(من أحدث في أمرنا هذا ما ليس منه فهو رد)
- عقيدة التوحيد(من أحدث في أمرنا هذا ما ليس منه فهو رد)
- فضل الإسلام{ من أحدث في أمرنا هذا ما ليس منه فهو رد } [3] ،
- فهم السلف الصالح للنصوص الشرعية والرد على الشبهات حوله"من أحدث في أمرنا ما ليس منه فهو رد"[2].
- قاموس الكبائر موسوعة الكبائر - المجموعة الأولى«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ» [41].
- كامل الصورة (1و2) لتعزيز اليقين وتثبيت الثوابتكامل الصورة (1,2) لتعزيز اليقين وتثبيت الثوابتمنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ»
- مادة العقيدة الإسلامية(من أحدث في أمرنا هذا ما ليس منه فهو رد)[12].
- مجموعة زاد الفقه (2)الفقه للمستوى الثاني ( مجموعة زاد )«من أحدث في أمرنا هذا ما ليس منه فهو رد».
- مجموعة زاد العقيده (4)العقيدة 4«مَنْ أَحْدَثَ في أَمْرِنا هَذا ما لَيْسَ منْهُ فَهُوَ رَدٌّ».
- مطوية الرقيةالرقية الشرعية - 1" مَن أحدث في أمرنا هذا ما ليس منه فهو رد".
- وثيقة منهج نبراس لمدارس نهاية الأسبوع1"من أحدث في أمرنا هذا ما ليس منه فهو رد"